తప్పతాగి రెచ్చిపోయిన ఎస్‌ఐ.. ఏం చేశాడంటే
లక్నోలో న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బారాబంకి పోలీస్ లైన్స్‌లో పనిచేస్తున్న ఎస్ఐ అమిత్ జైస్వాల్ మద్యం సేవించి వాహనం నడుపుతూ బారికేడ్‌ను ఢీకొట్టాడు. విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో అతడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు తెలిపారు.
న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. కొత్త ఏడాది సంబరాల్లో భాగంగా మందుబాబులు నడిరోడ్లపై హల్చల్ చేస్తారని కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేసి, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తారు. అలాంటిది ఓ పోలీసు ఆఫీసరు తప్పతాగడమే కాకుండా వాహనం నడుపుతూ బారికేడ్‌పైకి ఎక్కించేశాడు. అతడిని అడ్డుకొని నిలదీసిన పోలీసులపట్ల బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వేళ న్యూఇయర్ వేడుకల సందడి నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, లక్నోలోని హజ్రత్‌గంజ్ కూడలి వద్ద జన సమూహం, వాహనాల రద్దీ నియంత్రణకు ట్రాఫిక్ మళ్లింపు కోసం బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. మద్యం సేవించిన ఒక ఎస్‌ఐ కారు డ్రైవ్ చేసుకుంటూ బారికేడ్లు ఏర్పాటు చేసిన వైపు వచ్చాడు. వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించినా వినిపించుకోలేదు. రోడ్డుకు అడ్డుగా ఉంచిన బారికేడ్ల మీదకు కారును పోనిచ్చాడు. మరోవైపు పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. అంతేకాదు ఆ డ్రైవ్ చేసిన వ్యక్తి కూడా పోలీస్‌గా గుర్తించారు. కారులో మద్యం బాటిల్ ఉండటంతో అతడు తాగి వాహనం నడిపినట్లు పోలీసులు గ్రహించారు. కారు నుంచి కిందకు దిగిన ఆ ఎస్‌ఐ విధుల్లో ఉన్న ట్రాఫిక్ డీసీపీతోపాటు ఇతర పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతడ్ని నిలువరించిన పోలీసులను బెదిరించాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కూడా సహనం కోల్పోయారు.అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతను బారాబంకి పోలీస్ లైన్స్‌లో పనిచేస్తున్న ఎస్ఐ అమిత్ జైస్వాల్‌గా గుర్తించారు. ఆ ఎస్‌ఐ ప్రవర్తన పట్ల పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు మద్యం సేవించి కారు నడిపిన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎస్‌ఐ అమిత్ జైస్వాల్‌పై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. ఆ ఎస్‌ఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
న్యూ ఇయర్ వేళ మహేష్ ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్న నమ్రతా
భారీ ప్యాకేజీతో సంచలనం సృష్టించిన హైదరాబాద్ విద్యార్థి
తప్పతాగి రెచ్చిపోయిన ఎస్‌ఐ.. ఏం చేశాడంటే
కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం

