అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
కొత్త ఏడాది వేళ, బెంగళూరులో 15 మంది ఉన్నత విద్యావంతులైన యువత జైన సన్యాస దీక్ష తీసుకుంటున్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు అయిన ఈ శ్రీమంతులు ప్రాపంచిక బంధాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. వృద్ధులు ఎక్కువగా తీసుకునే ఈ దీక్షను యువత చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
కొత్త ఏడాది శుభసమయంలో యువత ఎంజాయ్ కోసం రకరకాల ప్లానింగ్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ మాత్రం సన్యాస దీక్ష తీసుకునేందుకు 15 మంది యువతీ యువకులు సిద్ధమయ్యారు. బెంగళూరులోని వీవీ పురం వాసవి ఆలయం సమీపంలోని శ్రీ సిమంధర్ శాంతి సూరి జైన సంఘం ఆవరణలో 20 నుంచి 40 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది సాధ్విలు, ఆరుగురు సాధువులు సన్యాస దీక్షకు ముందుకు వచ్చారు. ఇంజినీరింగ్, వైద్యం, విద్యావేత్తలు, ఎంబీఏ పూర్తి చేసిన వీరంతా శ్రీమంతులేనని సంఘం ప్రతినిధులు తెలిపారు. అఖిల భారతీయ జైన శ్వూతాంబరధర మూర్తి పూజక మహాసంఘానికి చెందిన మునులు వీరికి సన్యాస దీక్ష ఇస్తున్నారని సంఘం ప్రతినిధులు తెలిపారు. మరో వారం పాటు వీరికి దీక్ష ఇచ్చే ప్రక్రియ కొనసాగనుంది. హిందూ, జైన, బౌద్ధ సంప్రదాయాలలో సన్యాస దీక్ష ఎక్కువగా తీసుకూంటూ ఉంటారు. ప్రాపంచిక సుఖాలు, బంధాలను త్యజించడం ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం. ఆధ్యాత్మిక సాధన, అహింస, శాంతియుత సరళ జీవనం కోసం తీసుకునే అత్యున్నత దశగా చెబుతారు. ఇది ఆత్మ శుద్ధి, దైవత్వ సాక్షాత్కారం కోసం ఇంద్రియ నిగ్రహంతో ఆచరించే పవిత్రమైన కార్యం. అయితే ఎక్కువగా వయసు మీద పడినవారు వృద్దులు ఈ సన్యాస దీక్ష చేపడతారు. కానీ ఇక్కడ యువత సన్యాస దీక్ష చేపట్టడం ఆసక్తిగా మారింది. జైనమతంలో యువతీ యువకులు కూడా 20-40 ఏళ్ల వయస్సులో సాధ్విలుగా, సాధువులుగా సన్యాస దీక్షను తీసుకోవడం సాంప్రదాయంగా వస్తుందట. ప్రాపంచిక బాధ్యతల నుండి పూర్తిగా విముక్తి పొంది నిరంతర దైవచింతనలో గడుపడం కోసం చిన్న వయసులోనే సన్యాస దీక్ష చేపట్టడం ఆసక్తిని రేపుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహ్లీ, రోహిత్ గురించి పఠాన్ అంత మాటనేశాడేంటి ??
శ్రీశైలంలో చిరుత హల్చల్.. పూజారి ఇంటి ఆవరణలో
‘ఆమె నా కూతురు’ అంటూ.. షాకిచ్చిన టబు
ఘోరమైన పాపం చేశావ్.. హీరోయిన్‌పై ఫైర్ అవుతున్న మత పెద్దలు
Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్ కెరీర్‌కే మచ్చలాంటి సినిమా
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
తప్పతాగి రెచ్చిపోయిన ఎస్ఐ.. ఏం చేశాడంటే
కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత

