Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్ కెరీర్‌కే మచ్చలాంటి సినిమా
మోహన్‌లాల్ నటించిన 'వృషభ' చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. వరుస విజయాలతో దూసుకుపోయిన మోహన్‌లాల్‌కి ఈ సినిమా గట్టి ఎదురుదెబ్బ తీసింది. సుమారు 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన వృషభ కేవలం రూ. 1.94 కోట్లు మాత్రమే వసూలు చేసి, మేకర్స్‌కు రూ. 65 కోట్లకు పైగా నష్టం మిగిల్చింది. ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిన వృషభ ఫలితం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో చర్చనీయాంశంగా మారింది.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. స్పీడ్‌కు వృషభ సినిమా బ్రేక్ వేసింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. భారీ నష్టాన్ని మేకర్స్‌కు మిగిల్చింది. దీంతో 2025 ఇయర్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ జర్నీని ఎంజాయ్ చేసిన మోహన్ లాల్.. ఇయర్ ఎండ్‌లో మాత్రం వృషభ సినిమాతో దారుణ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు సౌత్ ఇండియన్ పిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. 2025 మోహన్‌లాల్ నటించిన లూసిఫర్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి… ఏకంగా రూ. 268 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన తుడరమ్ మూవీ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలతో బాటు బాక్సాఫీస్ దగ్గర రూ. 235 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన హృదయపూర్వం సినిమా కూడా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో మోహన్ లాల్ మూవీ అంటే మల్లూవుడ్ బాక్సాఫీస్ బద్దలే అనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో మోహన్ లాల్ .. వృషభ సినిమాపై అందరూ విపరీతంగా అంచనాలను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ‘వృషభ’ మూవీ అందరి అంచనాలను అందుకోలేక పోయింది. డే1 నుంచి నెగెటివ్ టాక్ రావడంతో.. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 5రోజుల్లో రూ. 1.94 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సుమారు రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా హిస్టరీ కెక్కింది. ఓవర్సీస్‌లో అయితే ఈ మూవీ 5 రోజుల్లో జస్ట్ రూ. 25 లక్షల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, తెలుగు వెర్షన్ రూ. 32 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. ఫైనల్‌గా ఈ మూవీ రూ. 65 కోట్లకు పైగానే నష్టాన్ని మిగల్చడం ఖాయంగానే కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..
TOP 9 ET News: పవర్ ఫుల్ ట్రైలర్ వచ్చేస్తోందోచ్… | మధ్యలో వీళ్లిద్దరిదో గోల.. రచ్చే రచ్చ !!
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
తప్పతాగి రెచ్చిపోయిన ఎస్‌ఐ.. ఏం చేశాడంటే
కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది

