Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. తొలుత 2025 సంక్రాంతికి రావాల్సి ఉన్నా, గ్రాఫిక్స్ ట్రోలింగ్‌తో వాయిదా పడింది. ప్రస్తుతం వశిష్ట టీమ్ VFX రీవర్క్ చేస్తోంది. చిరు సంతృప్తి చెందడంతో, 2026 జూన్‌లో ఈ సోషియో ఫాంటసీ మూవీ విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. 'మన శంకర వరప్రసాద్ గారు' తర్వాత చిరు ప్రమోషన్లలో పాల్గొంటారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో గేమ్ ఛేంజర్ అడ్డు రావడంతో ఈ మూవీ వాయిదా పడినట్టుగా ఓ టాక్ బయటికి వచ్చింది. ఆపై టీజర్ గ్రాఫిక్స్ విషయంలో ఫ్యాన్స్ నుంచి నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ రావడంతో… ఈ మూవీపై రీవర్క్ మొదలెట్టారు వశిష్ట టీం. దీంతో విశ్వంభర రిలీజ్ ఆగిపోయినట్టైంది. అయితే ఇంతలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ లైన్‌లోకి వచ్చేశాడు. మరో పదిరోజుల్లో సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈక్రమంలోనే విశ్వంభర రిలీజ్ గురించి అందరూ ఆరాలు తీయడం ఎక్కువవుతోంది. అయితే వారికోసమే అన్నట్టు ఈ మూవీ 2026 జూన్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టు ఫిల్మీ నగర్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఎట్ ప్రజెంట్ విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ పై రీవర్క్ చేస్తున్న వశిష్ట టీం ఈమూవీని ఎట్టిపరిస్థుతుల్లోనూ 2026 జూన్ లో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయినట్టుగా ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే చాలా వర్క్ సీజీ వర్క్ కంప్లీట్ అయిందని.. అవుట్ పుట్‌పై చిరు కూడా హ్యాపీగా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు మన శంకర వర ప్రసాదు గారు సినిమా రిలీజ్ తర్వాత చిరు కూడా విశ్వంభర ప్రమోషన్స్‌ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ప్లాన్స్ చేశారని.. తిరిగి ఈ సినిమాపై అంచనాలను పెంచడమే టార్గెట్‌గా వర్క్ చేస్తున్నారని టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: పవర్ ఫుల్ ట్రైలర్ వచ్చేస్తోందోచ్… | మధ్యలో వీళ్లిద్దరిదో గోల.. రచ్చే రచ్చ !!
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
సిగరెట్ రూ.18 కాదు.. ఇక రూ.72
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
తప్పతాగి రెచ్చిపోయిన ఎస్‌ఐ.. ఏం చేశాడంటే
కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది

