శ్రీశైలంలో చిరుత హల్చల్.. పూజారి ఇంటి ఆవరణలో
శ్రీశైలంలో చిరుతల సంచారం భక్తులను భయపెడుతోంది. పాతాళగంగ వద్ద పూజారి ఇంట్లోకి చిరుత ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆహారం కోసం తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పండుగల రద్దీ నేపథ్యంలో భక్తులు, స్థానికులు రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, అటవీ సిబ్బంది హెచ్చరించారు.
పుణ్యక్షేత్రాల్లో చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆహారం కోసం రాత్రి వేళ జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో మళ్లీ చిరుతపులి సంచారం కలకలకం రేపింది. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గం ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో నుంచి ఓ చిరుతపులి బయటకు వచ్చింది. రాత్రిపూట పూజారి ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. చిరుత సంచారం అక్కడున్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. అర్ధరాత్రి ఇంటి ఆవరణలో పులి సంచరించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం సీసీటీవీ పుటేజీ చూసిన పూజారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గతేడాది కూడా సరిగ్గా జనవరి నెలలోనే పూజారి ఇంటి ఆవరణలోకి చిరుత పులి వచ్చింది. అప్పుడు కూడా చిరుత ఎంట్రీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత చిరుత పూజారి ఇంట్లోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ చిరుత కనిపిస్తూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. చిరుత ఆహారం కోసం గ్రామంలోకి వచ్చి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం చుట్టుపక్కల దట్టమైన అడవి ఉండటంతో తరచూ చిరుతలు, ఇతర జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం వరుస సెలవులు, సంక్రాంతి పండుగల నేపథ్యంలో శ్రీశైలానికి భక్తులు తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది ప్రజలు రాత్రి పూట జాగ్రత్తగా ఉండాలని సూచించారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆమె నా కూతురు’ అంటూ.. షాకిచ్చిన టబు
ఘోరమైన పాపం చేశావ్.. హీరోయిన్‌పై ఫైర్ అవుతున్న మత పెద్దలు
Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్ కెరీర్‌కే మచ్చలాంటి సినిమా
Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..
TOP 9 ET News: పవర్ ఫుల్ ట్రైలర్ వచ్చేస్తోందోచ్… | మధ్యలో వీళ్లిద్దరిదో గోల.. రచ్చే రచ్చ !!
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
తప్పతాగి రెచ్చిపోయిన ఎస్ఐ.. ఏం చేశాడంటే
కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
