మగవాడిని మగవాడిలాగా పెంచడం లేదు.. మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. సూటిగా మట్లాడేతత్వమున్న ఆమె సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తుంది మాధవి లత .

ఒకానొక సమయంలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఇప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటుంది. 2008లో నచ్చావులే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, ఇప్పటికీ అంతే అందంగా ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవీ లత ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మాధవీ లత ఇటీవల సాయిబాబా గారిపై తాను చేసిన ఒక వీడియో గురించి మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అయ్యి, పోలీసు ఫిర్యాదుకు దారితీసిందని ఆమె చెప్పుకొచ్చారు. తాను మాట్లాడింది సరైందేనని, కాబట్టి భయం లేదని మాధవీ లత ధీమా వ్యక్తం చేశారు. షిర్డీకి వెళ్లి చూస్తే, అక్కడి పుస్తకాలలో సాయిబాబా అఫ్ఘన్ ముస్లింగా నమోదై ఉందని ఆమె పేర్కొన్నారు.
దర్గాలకు, చర్చిలకు వెళ్ళినట్లే సాయిబాబాను పూజించడంలో తప్పేంటని ప్రశ్నించింది. ఒక క్రైస్తవుడు గర్వంగా క్రైస్తవుడిగా, ఒక ముస్లిం గర్వంగా ముస్లింగా ఉన్నప్పుడు, ఒక హిందువు హిందువుగా ఎందుకు ఉండకూడదని తెలిపింది. హిందువులు తమ దేవుడిని మొక్కాలని ఇతరులకు చెప్పే హక్కు 100శాతం ఉందని, ప్రపంచానికి నీతి చెప్పిన దేశం మనదని మాధవీ లత అన్నారు. నా అన్వేషణ అనే ఛానెల్ లో అన్వేష్ అనే వ్యక్తి హిందూ మతం, హిందూ ధర్మం, సీతమ్మ గురించి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడింది మాధవీ లత. దీనిపై ఇప్పటికే కేసు నమోదైందని, గత నెలలో తాను కూడా అన్వేష్‌పై ఒక వీడియో చేశానని మాధవీ లత తెలిపారు.
ఈ రోజుకి చాలామంది పీరియడ్స్ అనే మాట ఎత్తడానికి కూడా భయపడుతున్నారని, ఎందుకంటే ఇళ్లల్లో ఒక మగవాడిని మగవాడిలాగా పెంచట్లేదని ఆమె కామెంట్స్ చేశారు. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు కాబోయేవాడు చాలా జెన్యూన్‌గా ఉండాలని, మహిళలకు చాలా గౌరవం ఇవ్వాలని ఆశిస్తానని తెలిపారు. పరిశ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జాగ్రత్త పడాలి అని అనిపించిందా.? అనే ప్రశ్నకు, రాత్రి నిద్రపోయే ముందు అనిపిస్తుందని, తెల్లారేక మర్చిపోతానని సరదాగా సమాధానమిచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




