అప్పుడు రూ. 500 ఇప్పుడు రూ. 4 కోట్ల రెమ్యునరేషన్.. ఈ అమ్మడి రూటే సపరేటు..
చాలా మంది ముద్దుగుమ్మలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కానీ కొందరు మాత్రమే వరుసగా హిట్స్ అందుకుంటున్నారు. కొంతమంది మాత్రం రేస్ లో వెనకబడుతున్నారు . అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నది.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణిస్తున్నారు. హీరోలకు సమానంగా నటనతోనే కాదు రెమ్యునరేషన్ కూడా హీరోలకు సమానంగా అందుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా మంది కొత్త భామలు సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డామ్ సొంతం చేసుకుంటున్నారు. ఒక్క భాషలోనే కాదు.. నాలుగు ఐదు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. అలాగే పాన్ ఇండియా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొత్త ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇవ్వడంతో కొంతమంది హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గాయి. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఒకానొక సమయంలో హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.. ఇప్పుడు అంతగా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. కెరీర్ బిగినింగ్ లో రూ. 500 రెమ్యునరేషన్ తీసుకున్న ఆమె ఇప్పుడు కోట్ల రూపాయిలు అందుకుంటుంది.
మలయాళ చిత్రంతో నటిగా కెరీర్ మొదలు పెట్టింది నటి కీర్తి సురేశ్. తండ్రి నటన వారసత్వం ఉన్నా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే విజయవంతమైన చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది కీర్తి. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది ఇక్కడి ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేసింది. ఇక మహానటి సినిమాతో కీర్తి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాలో అచ్చంగా సావిత్రిలా కనిపించి తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఈ సినిమాకు కీర్తి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అయితే జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకొని.. ప్రస్తుతం రూ. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న కీర్తి సురేశ్ తొలి సంపాదన ఎంతో తెలుసా..?
కేవలం రూ. 500 గతంలో ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది. అయితే కీర్తి సురేశ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన విషయం తెలిసిందే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సమయంలో నిర్మాతలు తనకు డబ్బుల కవర్ ఇచ్చేవారట.. దాన్ని తాను తీసుకొని నేరుగా తన తండ్రికి ఇచ్చేదట. దీంతో అందులో ఎంత డబ్బు ఉండేదో కీర్తికి తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. కానీ ఓసారి కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసినందుకుగాను రూ. 500 ఇచ్చారంట..దీంతో ఆ డబ్బును కీర్తి నేరుగా అందుకున్నా.. అందుకే తన ఊహ తెలిసిన మొదటి సంపాదన ఈ రూ. 500 అనే చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్. అందుకే బాల నటిగా వచ్చిన రెమ్యునరేషన్ కాకుండా రూ.500 తన తొలి సంపాదనగా భావిస్తున్నట్లు కీర్తి తెలిపింది అయితే ఆ డబ్బును కూడా కీర్తి తన పాకెట్ మనీ కోసం వాడుకోకుండా తన తండ్రికే ఇచ్చేసిందట. ప్రస్తుతం కీర్తిసురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తుంది. ఈ అమ్మడు ఒకొక్క సినిమాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




