Thalapathy Vijay: జన నాయగన్ కథ విషయంలో కన్ఫ్యూజన్
దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' రీమేక్ అన్న వార్తలు జోరందుకున్నాయి. దర్శకుడు హెచ్. వినోద్ ఖండించినా, అనిల్ రావిపూడి వ్యాఖ్యలు గందరగోళాన్ని పెంచాయి. అసలు విషయం తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.
కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి సినిమా జన నాయగన్. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రిలీజ్ డైరెక్టర్ పడుతుండటంతో ఈ వార్తలపై క్లారిటీ వస్తుందనుకుంటే మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. ఇదే విజయ్ ఆఖరి చిత్రం కూడా కావటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్. భారీగా రూపొందుతున్న జన నాయగన్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరికి రీమేక్ అన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. కాస్టింగ్ అప్‌డేట్స్ కూడా ఈ వార్తలకు బలాన్నిచ్చేలాగే అనిపించాయి. ఇప్పటి వరకు వచ్చిన మూవీ అప్‌డేట్స్ కూడా రీమేక్ మూవీనే అనిపించేలా ఉన్నాయి. రీసెంట్‌గా జరిగిన మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌లో రీమేక్ వార్తలపై స్పందించారు దర్శకుడు హెచ్ వినోద్. ఇది పూర్తిగా విజయ్ సినిమా అని, దళపతి కోసం అభిమానులు ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో ఉంటాయన్నారు. దీంతో మరోసారి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. తాజాగా భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో ట్విస్ట్ ఇచ్చారు. విజయ్ ట్రూ జెంటిల్మన్ అన్న అనిల్, ఆ సినిమాలో తాను భాగమా కాదా అన్నది సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తుందన్నారు. దీంతో రీమేక్ వార్తలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి..
ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే

