ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
సాధారణ రైతులు ఎదుర్కొనే ఖరీదైన వ్యవసాయ యంత్రాల సమస్యకు ఓ తెలుగు రైతు అద్భుత పరిష్కారం చూపారు. ఎయిర్ కూలర్‌ను ఉపయోగించి ధాన్యాన్ని తూర్పారబట్టే వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. ఈ తక్కువ ఖర్చుతో కూడిన సృజనాత్మక ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అయింది, లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకొని, రైతు తెలివికి ప్రశంసలు దక్కాయి.
ఎందరో లక్షలు ఖర్చుచేసి ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి పెద్ద పెద్ద కోర్సులు చదివి పట్టాలు తీసుకుంటున్నారు. కానీ ప్రకృతి ఒడిలో విద్యనభ్యసించి దేశం ఆకలి తీర్చేందుకు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకునేది కేవలం రైతు మాత్రమే. ఏ విద్యా లేకపోయినా, ఎలాంటి పట్టా లేకున్నా.. ప్రకృతి భాషను అర్థంచేసుకొని ఫలసాయాన్ని సాధించటం రైతుకు మాత్రమే సాధ్యం. అలాంటి రైతుల్లో కొందరు తమ సృజనాత్మకతకు పదునుపెట్టి.. వ్యవసాయానికి కావలసిన ఎన్నో పరికరాలను తామే స్వయంగా రూపొందించుకుని ఇంజనీర్లను సైతం అబ్బురపరుస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రైతు ఆలోచనకు సలాం అంటున్నారు. చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరించి.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటారు. సాధారణంగా పొలంలో వరి కోసిన తర్వాత దానిని ట్రాక్టర్‌తో తొక్కించి, వరిగడ్డిని దులుపి, ఆ ధాన్యాన్ని చేటలతో గాలివాలుకు ఎదురుగా నిలబడి తూర్పారపడుతుంటారు. ఇటీవల వరికోత యంత్రాలు, ధాన్యాన్ని ఏ మానవశ్రమా లేకుండా సేకరించే యంత్రాలు వచ్చినా అవి బాగా ఖరీదైనవి కావటంతో చిన్న, సన్నకారు రైతులు వాటిని కొనలేని పరిస్థితి. ఇదే విషయంపై కాస్త రీసెర్చి చేసిన ఆ రైతు.. ఇంట్లో ఉన్న ఎయిర్ కూలర్‌ను వాడి ధాన్యాన్ని తూర్పారబట్టలేమా? అని ఆలోచించాడు. వెంటనే తన ఆలోచనను అమలు చేశాడు. ఒక అట్టపెట్టెకు పెద్ద రంద్రం చేసి దానిని కూలర్‌పైన ఉంచి కూలర్ ఆన్ చేశాడు. కూలర్‌లో ఫ్యాన్ తిరుగుతూ ఉండగా, పైన అట్టపెట్టెలో ఇద్దరు రైతుల చేత బకెట్లతో ధాన్యం పోయించాడు. అట్టపెట్టె రంద్రం నుంచి ధాన్యం కిందపడుతుంటే కూలర్ ఫ్యాన్‌నుంచి వచ్చే గాలికి ధాన్యం నుంచి పొల్లు, గడ్డి దూరంగా ఎగిరిపోతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు నాలుగు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 9 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రైతు ఆలోచనకు ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
Hyderabad: ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
వందేభారత్.. 180 కి.మీ స్పీడ్.. గ్లాస్ వణకలేదు..నీళ్ళు తొణకలేదు
LPG Gas Cylinder: బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి..
ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే

