AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పోలీసులూ జాగ్రత్త..! తెలంగాణలో అధికార విపక్షాల నుంచి వార్నింగ్స్..

పోలీసులూ జాగ్రత్త.! చట్టాన్ని విస్మరించొద్దు. అలాగని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. వీటిల్లో ఏ ఒక్కటి జరిగినా మీ పోస్టింగ్ ఊస్టింగేనంటూ తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీలు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అధికారులపై కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఈ రాజకీయ స్వీట్ వార్నింగ్‌లకు కారణమేంటి?

Telangana: పోలీసులూ జాగ్రత్త..! తెలంగాణలో అధికార విపక్షాల నుంచి వార్నింగ్స్..
Telangana Police
Ravi Kiran
|

Updated on: Mar 10, 2026 | 7:00 AM

Share

పోలీసులూ జాగ్రత్త.! చట్టాన్ని విస్మరించొద్దు. అలాగని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. వీటిల్లో ఏ ఒక్కటి జరిగినా మీ పోస్టింగ్ ఊస్టింగేనంటూ తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీలు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అధికారులపై కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఈ రాజకీయ స్వీట్ వార్నింగ్‌లకు కారణమేంటి? పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారుల్లో ఎవరు ఏంటో తనకు తెలుసన్నారు. అధికారుల ప్రొఫైల్‌ను మూడు కేటగిరీలుగా విభజించుకున్నానని వివరించారు. దీని ఆధారంగానే ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు. పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో.. పైరవీలు.. రాజకీయ జోక్యం ఏమాత్రం లేదన్నారు సీఎం రేవంత్. పోలీసులందరి డేటా తన దగ్గర ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఎవరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలో ఆ డేటా ఆధారంగానే డిసైడ్ చేస్తానని అన్నారు. పోలీసులు కూడా పక్కాగా డేటా మెయింటైన్ చేయాలని అన్నారు.

పోలీసులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించకపోతే.. పోస్టింగులు ఆశించవద్దంటూ సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక.. విపక్షాలు సైతం పోలీసులను టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అధికారపార్టీతో కలిసి కుయుక్తులు చేస్తే.. తర్వాత తాము వచ్చాక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ బహిరంగంగానే బీఆర్‌ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా.. అన్ని రాజకీయ పార్టీలు, పోలీసులే టార్గెట్‌గా కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..