ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు ఆ ఇద్దరు మిత్రులు.. ఇండస్ట్రీకి చెందిన వారే అయినా.. వారి ప్రొఫిషన్ వేరు.. ఎవరి దారిలో వారు సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. కాగా ఈ ఇద్దరు మిత్రులు ఒకే రోజు పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు..

టాలీవుడ్ లో ఆ ఇద్దరూ తోపులు.. తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు. సినిమాల్లోకి రాక ముందు ఆ ఇద్దరూ ఎన్నో కష్టాలను చూశారు.. అలాగే పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. కడుపు నిండా తినడానికి సరైన తిండి లేక అలమటించారు.. ఫైనల్ గా సినిమాల పై ఉన్న మక్కువతో ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. ఇప్పుడు టాప్ ప్లేస్ లో రాణిస్తున్నారు. ఆ ఇద్దరూ మంచి మిత్రులు. సినిమాల్లోకి రాక ముందు ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. వారి స్నేహం ఇప్పటికీ అలానే ఉంది.. ఇంత ప్రాణస్నేహితులు అయినప్పటికీ ఒకరి పెళ్ళికి మరొకరు వెళ్లలేకపోయారట.. దానికి కారణం ఏంటో తెలుసా..? ఇద్దరూ ఒకే రోజున పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇంతకూ ఆ ఇద్దరు మిత్రులు ఎవరో కాదు..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, అలాగే విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా త్రివిక్రమ్, నటుడిగా సునీల్ సినిమాల్లో దూసుకుపోతున్నారు. త్రివిక్రమ్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆపై డైరెక్టర్ గా మారారు. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్.. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసి టాప్ ప్లేస్ కు చేరుకున్నారు.
ఇక సునీల్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారాడు. కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్.. హీరోగా మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఆతర్వాత నెగిటివ్ రోల్స్ చేస్తూ మెప్పించాడు. ఇప్పుడు మరోసారి తన కామెడీతో ఆకట్టుకుంటున్నారు. కాగా సునీల్ పెళ్లి, త్రివిక్రమ్ పెళ్లి ఒకే రోజున జరిగాయట. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. అక్టోబర్ 11 2002లో సునీల్ వివాహం హైదరాబాద్ లోని శిల్పారామం దగ్గర ఉన్న సైబర్ గార్డెన్ లో ఘనంగా జరగ్గా.. అదే రోజు శ్రీనగర్ కాలనీలోని.. శ్రీ సత్యసాయి నిగమాగమంలో త్రివిక్రమ్ వివాహం జరిగిందట. ఇలా ఇద్దరి పెళ్లి ఒకే రోజు జరగడంతో ఒకరి వివాహానికి ఒకరు వెళ్లలేకపోయరట ఈ ప్రాణస్నేహితులు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




