ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. నటుడిగా ప్రేక్షకులను అలరించారు పోసాని. గతంలో దర్శకుడిగా, రచయితగా మెప్పించిన పోసాని.. నటుడిగా విభిన్నమైన పాత్రలు చేస్తూ మెప్పించారు. కాగా గత కొద్దిరోజులుగా సినిమాలకు పోసాని దూరంగా ఉంటున్నారు .

రచయితగా, నటుడిగా, దర్శకుడిగా తన సత్తా చాటారు పోసాని మురళి కృష్ణ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో రకరకాల పాత్రలు చేశారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన పోసాని.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలాగే గతంలో పోసాని కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అలాగే మొన్నామధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ గురించి వివరించారు. అనారోగ్యం క్షీణించినప్పుడు నేను చనిపోతాను అని అనిపించింది అని తెలిపారు పోసాని కృష్ణమురళి. తనకు హెర్నియా ఆపరేషన్ తర్వాత తనకు ఎదురైన సమస్యలను గుర్తు చేసుకున్నారు పోసాని కృష్ణమురళి.
ఎదో మాములు సర్జరీ అనుకున్నా కానీ అది తనను మరణం అంచులకు తీసుకెళ్లిందని తెలిపారు పోసాని. కేవలం ఇరవై రోజుల్లో ఏడు కిలోల బరువు కోల్పోయానని, తాను బ్రతకడం కష్టమని తనకు, తన భార్యకు తెలిసిపోయిందని ఎమోషనల్ అయ్యారు. డాక్టర్ రెండో సారి సర్జరీ చేస్తాను అన్నప్పుడు వద్దు.. నేను ఇక బ్రతకను అనిపిస్తుంది. ఉన్న రెండు రోజులు నా భార్య పిల్లలను చూస్తూ ఉండిపోతాను అని చెప్పా.. దాంతో డాక్టర్ కూడా వెళ్లిపోయారు. అప్పట్లో లండన్‌లో ఉన్న ఎం.వి.రావు తన పరిస్థితి గురించి తెలిసి వెంటనే హైదరాబాద్‌కు వచ్చి సహాయం చేశారని తెలిపారు.
మాజీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా తన ఆరోగ్యం గురించి తెలుసుకుని, వై.సి.పి. నాయకులైన శశిధర్, లక్ష్మీ రెడ్డిలను పంపడమే కాకుండా, స్వయంగా తనను చూడటానికి వచ్చారని, దాదాపు గంటసేపు తనతో గడిపారని పోసాని గుర్తు చేసుకున్నారు. చివరకు రెండవ శస్త్రచికిత్స ద్వారా ఇన్ఫెక్షన్ తొలగించబడటంతో, తాను కోలుకున్నానని, ఇది తనకు పునర్జన్మ అని పేర్కొన్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి తిరిగి కోలుకున్నారు. త్వరలోనే ఆయన సినిమాల్లో నటించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పోసాని తిరిగి దర్శకుడిగా మారబోతున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




