పనిమనిషిలా ఉందని రిజెక్ట్ చేశా.. కట్ చేస్తే ఆమెతోనే ఎనిమిది సినిమాలు, పెళ్లి కూడా
ఒకప్పుడు హీరోలుగా చేసిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా రాణిస్తున్నారు. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ జగపతి బాబు , శ్రీకాంత్.. ఇలా ఇంకొంతమంది కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో రాంకీ ఒకరు. ఈ నటుడి పూర్తి పేరు రామకృష్ణ. కాగా రాంకీగా పాపులర్ అయ్యారు.

ఒకప్పుడు హీరోగా రాణించిన చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఎంతో మంది నటులు ఇప్పుడు విలన్స్ గా, సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నారు. వారిలో రామ్కీ ఒకరు. సిందూర పువ్వు అనే సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు రామ్కీ.. ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అలాగే పలు సినిమాల్లో సహాయక పాత్రల్లోనూ కనిపించారు రామ్కీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో రామ్కీ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సిందూర పువ్వు చిత్రానికి ముందు రామ్కీ ఐదు సినిమాల్లో నటించి విజయవంతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ
సింధూరపువ్వు సినిమా కోసం దర్శకుడు, నిర్మాత అయిన తన స్నేహితుడు అబావనన్ హీరోయిన్ నిరోషాను సూచించినప్పుడు, లండన్ నుండి వచ్చిన నిరోషాను చూసి రామ్కీ మొదట నిరాకరించారట. ఈ అమ్మాయి బాగాలేదు, వద్దు, పనిమనిషిలా ఉంది అని అన్నారట. అయినప్పటికీ, నిరోషా సింధూరపువ్వు చిత్రంలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అంతకన్నా ముందు కమల్ హాసన్ సినిమాలో నటించింది ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే రామ్కీ నిరోషాను రిజెక్ట్ చేసిన విషయం ఆమెకు తెలిసిపోయిందట.. దాంతో షూటింగ్ మొదటి రోజు నుంచే వారిద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలిపారు. అయితే, ఈ గొడవలే క్రమంగా రొమాన్స్‌గా మారాయి. రామ్కీ, నిరోషా కలిసి దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించారు, అందులో ఏడు చిత్రాలు వంద రోజులు ప్రదర్శించబడ్డాయి. సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తూ దాదాపు వంద రోజుల పాటు కలిసి ప్రయాణించి, నటించడం ద్వారా వారి మధ్య బంధం బలపడిందని తెలిపారు రామ్కీ.
ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృషవంశీ
అయితే షూటింగ్ సమయంలో నిరోషాకు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు రామ్కీ ఆమెను రక్షించినట్లు కూడా తెలిపారు. రామ్కీ తమ వివాహం గురించి ఆలస్యంగా ప్రకటించినట్లు వివరించారు. 1998లో పెళ్లి చేసుకున్నప్పటికీ, 1987 నుంచే వారు సహజీవనం (లివింగ్ టుగెదర్) చేసినట్లు తెలిపారు. రామ్కీ ఆ రోజుల్లో రొమాంటిక్ హీరోగా ఎన్నో ప్రేమ ప్రపోజల్స్ అందుకున్నారని, వాటి వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయని పంచుకున్నారు. అయితే, నిరోషాకు ఎవరు ముందు ప్రపోజ్ చేశారన్న ప్రశ్నకు, సినిమాల్లో లవ్ డైలాగ్‌లు చెప్పి, పదిసార్లు మంగళసూత్రాలు కట్టడం సర్వసాధారణం అయింది అని సమాధానమిచ్చారు. రీల్ లైఫ్‌లో చెప్పిన డైలాగ్‌లు రియల్ లైఫ్‌లో కూడా వారికి ఉపయోగపడ్డాయని, వారి ప్రేమ సహజంగానే వికసించిందని రామ్కీ వివరించారు.
EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




