AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్

జబర్దస్త్ షో నుంచి షైన్‌ అయ్యాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. జబర్దస్త్ ఒక్కటే కాదు… మల్లెమాల ప్రొడక్షన్స్‌లో చాలా షోలే చేస్తున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నరేష్.

EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్
Jabardasth Naresh
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2026 | 11:47 AM

Share

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చిన నటుల్లో నరేష్ ఒకరు. ఈ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. వరుసగా టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నరేష్. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు నరేష్.. ఈ ఇంటర్వ్యూలో నరేష్ తన పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి ఆసక్తికర చెప్పుకొచ్చాడు. తనకు పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో ఒక సంతోషకరమైన కుటుంబాన్ని పోషించాలనే కోరిక ఉందని  తెలిపాడు. తనకి ఇంట్లో వారు సరైన సంబంధాలు చూస్తున్నారని, కట్నాల పట్ల ఆసక్తి లేదని, అమ్మాయి అడిగితే తానె కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సరదాగా అన్నాడు నరేశ్. తన కాబోయే భార్య తనకంటే కొద్దిగా ఎత్తుగా ఉండాలని, తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, అలాగే తన కెరీర్, పని తీరును అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈవెంట్లకు వెళ్లినప్పుడు ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా టచ్‌లో ఉంటానని, దూరమైపోతున్నానని అనుకోకూడదు తెలిపాడు.

ఇటీవల ప్రోమోలో చూపించిన పెళ్లిచూపులు కేవలం ఒక స్కిట్ కోసమేనని, అది నిజం కాదని నరేష్ స్పష్టం చేశాడు.  తన కష్టమంతా తన కుటుంబం కోసమేనని, వారు బాగుండాలని తెలిపారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి  అనే నానుడిని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని చూస్తున్నట్లు చెప్పాడు. తన కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదనే భయం ఎప్పుడూ తనలో ఉంటుందని, అందుకే వ్యాపారం లాంటి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తన గతంలోని కష్టాలను గుర్తుచేసుకుంటూ, నరేష్ తన బాల్యం నుంచి ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లను వివరించాడు.

తన తండ్రి ఆటో ట్రాలీ నడిపేవారని, అది నష్టాలతో నడిచేదని, EMIలు కట్టలేక ఫైనాన్షియల్ వాళ్ళు ఆటోను తీసుకెళ్లిపోయారని తెలిపాడు. తమకు ఒక చిన్న షాపు ఉండేదని, అది కూడా ఇంట్లో పరిస్థితులు బాగాలేక అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు. తన కుటుంబం ఆర్థిక చాలా కష్టాలు చూసిందని తెలిపాడు. ఈ కష్టాల నుంచి ఇప్పుడు బయట పడ్డాం, తన కుటుంబం మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.