AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా పెళ్లి అయ్యి, అబార్షన్ కూడా అయ్యిందని అన్నారు.. అసలు విషయాలు బయటపెట్టిన పూనమ్ కౌర్

నటి పూనమ్ కౌర్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన పూనమ్. ఆతర్వాత పలు సహాయక పాత్రలు చేసింది. ఆతర్వాత ఉన్నటుండి సినిమాలు దూరం అయ్యింది. పూనమ్ సినిమాలకు దూరంగా ఉంటున్నా.. పలువురి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్ని సార్లు వార్తల్లో నిలిచింది.

నా పెళ్లి అయ్యి, అబార్షన్ కూడా అయ్యిందని అన్నారు.. అసలు విషయాలు బయటపెట్టిన పూనమ్ కౌర్
Poonam Kour
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2026 | 12:29 PM

Share

నటి పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది ఆతర్వాత సహాయక పాత్రల్లో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత సినిమాల నుంచి దూరం అయ్యింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సంచలన విషయాలను పంచుకున్నారు. మీడియా తనను ఎలా తప్పుగా చిత్రీకరించిందో, రాజకీయ వర్గాల నుండి తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె వివరించారు. ఆమె న్యాయం కోసం MAA అసోసియేషన్‌ను ఆశ్రయించడానికి కారణాలను కూడా తెలిపారు పూనమ్ కౌర్, పోలీసు స్టేషన్లలో న్యాయం అమ్ముడుపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చేనేత వస్త్రాలపై 0 జీఎస్టీ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 97 మంది ఎంపీల సంతకాలను సేకరించేందుకు ఆమె కృషి చేశా. అయితే, ఈ కృషిని ప్రజలు తనను ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా చూసేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పూనమ్. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని, ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తనకు అమ్మమ్మ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గిల్టీగా అనిపించిందని, తాను పడుతున్న కష్టం, ట్రామా తన కుటుంబంపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

నా పెళ్లి అయిపోయింది, అబార్షన్ కూడా అయిపోయింది, నాకు సీక్రెట్ పిల్లలు కూడా ఉన్నారు. అలాగే రాహుల్ గాంధీతో పెళ్లి అయిపోయింది, అఫైర్ కూడా ఉంది. ఈ పుకార్లన్నీ పుట్టించిన మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని ఆమె అన్నారు.. ఒక రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉండి ఉంటే తన జీవితం ఇంత కష్టంగా ఉండేది కాదని ఆమె అన్నారు. చిన్ననాటి నుండి మహాభారతం, రామాయణం చూస్తే, రాజకీయాల్లో అమ్మాయిలనే బలిపశువులుగా వాడుతారని ఆమె అన్నారు. తన సిక్కు వారసత్వం, మహారాజా రంజిత్ సింగ్ వంశం నుంచి వచ్చిన తన కుటుంబం గురించి వివరించారు. తాను చేసిన చేనేత పని పెద్ద పెద్ద మంత్రుల కూతుర్లు లేదా కోడళ్ళు చేసి ఉంటే వేరే స్థాయిలో ప్రశంసలు అందుకునేవని అభిప్రాయపడ్డారు. జయలలిత, సుష్మా స్వరాజ్, సింధుతాయ్ సప్కల్ వంటి నాయకులను గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో తాను నిర్వహించిన ఒక సమావేశానికి 15 మంది ఎంపీలు హాజరయ్యారని, అయితే ఆ టెలికాస్ట్ ను ఇక్కడ ఆపేశారని తెలిపారు. రతన్ టాటా నుండి వీడియో కాల్ వచ్చినప్పుడు తన సంతోషాన్ని వర్ణించారు. తన తండ్రి, గురువుల మార్గదర్శకత్వంలోనే చేనేత పనిని చేపట్టినట్లు పూనమ్ కౌర్ వెల్లడించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

నీటి బుడగ పేలినట్లు పడిపోయిన వెండి ధరలు..రూ.65,000వేల కంటే...
నీటి బుడగ పేలినట్లు పడిపోయిన వెండి ధరలు..రూ.65,000వేల కంటే...
‘తలైవా’ బయోపిక్‌పై కూతురు సౌందర్య క్లారిటీ ఇదే!
‘తలైవా’ బయోపిక్‌పై కూతురు సౌందర్య క్లారిటీ ఇదే!
విమానం నడిపే ఏకైక హీరోయిన్..
విమానం నడిపే ఏకైక హీరోయిన్..
VD: 2 భిన్నమైన బాడీ లాంగ్వేజెస్‌.. యాస కోసం ప్రత్యేక శిక్షణ!
VD: 2 భిన్నమైన బాడీ లాంగ్వేజెస్‌.. యాస కోసం ప్రత్యేక శిక్షణ!
సోంపు తినడం కాదు.. ఇలా తీసుకుంటే లక్షలు ఆదా చేసినట్టే.. !
సోంపు తినడం కాదు.. ఇలా తీసుకుంటే లక్షలు ఆదా చేసినట్టే.. !
ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో దూకుడు
ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో దూకుడు
వందల కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న చిరు పొంగల్ హిట్స్
వందల కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న చిరు పొంగల్ హిట్స్
విదేశాల్లోనూ జగన్నాథుడి వైభవం.. ఆక్స్‌ఫర్డ్ మ్యూజియంలో విగ్రహాలు.
విదేశాల్లోనూ జగన్నాథుడి వైభవం.. ఆక్స్‌ఫర్డ్ మ్యూజియంలో విగ్రహాలు.
ముసుగులు ధరించి మైదానంలోకి.. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో షాకింగ్ సీన్
ముసుగులు ధరించి మైదానంలోకి.. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో షాకింగ్ సీన్
‘మన శంకరవరప్రసాద్’ హిట్ తర్వాత అక్కకు అరుదైన కానుక ఇచ్చిన చరణ్!
‘మన శంకరవరప్రసాద్’ హిట్ తర్వాత అక్కకు అరుదైన కానుక ఇచ్చిన చరణ్!