AP News: కిలో టమాట ధర రూ.2లే.. ఆరుగాలం పండించిన పంట పశువుల పాలు! వీడియో
టమోటా ధర భారీగా కుప్పకూలింది. 25 కిలోల టమోటా బాక్సు ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. అంటే కేవలం కిలో రెండు రూపాయలు అన్న మాట. ఇలాంటి పరిస్థితులలో కూలీల ఖర్చులు రవాణా ఖర్చులు కూడా రావట్లేదు. ఈ ఉద్దేశంతో పొలంలోనే పంటని గొర్రెలకు, పశువులకు మేతగా వదిలేస్తున్న దృశ్యాలు చూపరులను..

కర్నూలు, మార్చి 12: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమోటా ధర కుప్పకూలింది. 25 కిలోల టమోటా బాక్సు ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. అంటే కేవలం కిలో రెండు రూపాయలు అన్న మాట. ఇలాంటి పరిస్థితులలో కూలీల ఖర్చులు రవాణా ఖర్చులు కూడా రావట్లేదు. ఈ ఉద్దేశంతో పొలంలోనే పంటని గొర్రెలకు, పశువులకు మేతగా వదిలేస్తున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. కోటి ఆశలతో సాగుచేసిన టమోటా పంట మరోసారి రైతులను అప్పులపాలు చేసింది. పంట చేతికి వచ్చాక టమోటాకు ధరలు లేకపోవడంతో కాయలను పొలంలోనే కోయకుండానే వదిలేశారు. ఇంకొందరు రైతులు గొర్రెలు, పశువులకు మేతగా వేస్తున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కేంద్రంలో చాలా మంది రైతులు ఎన్నో ఆశలతో టమోటా పంటను సాగు చేశారు. ఒక ఎకరాకు సుమారు రూ. 60 వేలు నుండి 80 వేలు పెట్టుబడి పెట్టారు. కాయలు కూడా ఎంతో బాగా పండాయి. దీంతో రైతులు ఈ సారి టమోటతో తమ జీవితాలు మారుతాయి. అనుకునేలోపు ఒక్కసారిగా టమోటా ధర అమాంతం పడిపోవడంతో టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి టమోటా కాయలను ఒక్కో కూలికి రూ.300 ఇచ్చి కూలీలను పెట్టి కోయిస్తే, సుమారు ఎకరాకు మూడు వందలు బాక్స్‌లు టమోటాలు వస్తాయి. వాటిని అమ్ముకోవడానికి మార్కెట్ కు తరలించేదుకు 25 కేజీలు కలిగిన ఒక బాక్స్ కు రవాణా ఖర్చు రూ.50 అవుతుంది. తీరా మార్కెట్ కు వెళ్ళాక అక్కడ బాక్స్ వ్యాపారులు రూ.40 అడగడంతో టమోటా రైతులు లబోదిబోమంటున్నారు.
పెట్టిన పెట్టుబడి రాక, తిరిగి అమ్ముకోవడానికి మరల చేతి నుంచి డబ్బులు పెట్టుకోలేక చాలా మంది రైతులు టమోటాను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొంత మంది రైతులు గొర్రెలకు మేత గా వేస్తూ, రైతులు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ఉల్లిని కొన్నట్టే టమోటాను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలి రైతులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
