AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ప్రభాస్‌ పక్కన హీరోయిన్ అనగానే స్పామ్ కాల్ అనుకున్నా.. అంత మాట అనేసిందేంటి..

ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' మూవీలో తన రోల్ ఏంటి.? తనకు ఆ రోల్ ఎలా వచ్చిందో.. పలు కీలక విషయాలు పంచుకుంది నటి రిధి కుమార్. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించాలని ఫోన్ వస్తే.. తాను మొదట ఇలా ఊహించానని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు ఇలా..

Actress: ప్రభాస్‌ పక్కన హీరోయిన్ అనగానే స్పామ్ కాల్ అనుకున్నా.. అంత మాట అనేసిందేంటి..
Prabhas
Ravi Kiran
|

Updated on: Jan 05, 2026 | 12:31 PM

Share

ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం ‘ది రాజా సాబ్’. డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కొంచెం ఆలస్యంగా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రిధి కుమార్ సినిమా గురించి పలు కీలక విషయాలను పంచుకుంది. ప్రతి నటికీ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది. ప్రభాస్‌తో తాను ‘రాధేశ్యామ్’ సినిమా చేశానని రిధి చెప్పింది.. ఇలా తనకు అతడితో కలిసి రెండోసారి నటించే అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపింది. ఇక రాధేశ్యామ్ మూవీలో తాను చేసిన ఒక సన్నివేశంలో తన నటనను ప్రభాస్ ఎంతో మెచ్చుకున్నాడని, ఆ సమయంలో ‘హూ ఈజ్ షీ, హౌ వెల్ షీ పర్ఫార్మ్డ్’ అని అన్నాడని, ఆ మాటలే తనకు ది రాజా సాబ్ అవకాశాన్ని తెచ్చిపెట్టాయని ఆమె చెప్పింది. మొదట్లో నిర్మాత ఎస్‌కెఎన్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఒక స్పామ్ కాల్ అనుకొని నమ్మలేదని, ఆ తర్వాత తన మేనేజర్ వివరించడంతోనే ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చింది. అలా తనకు ఈ రాజాసాబ్ అవకాశం వచ్చిందంది. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ సమయంలో తనకు తొలి రోజున ప్రభాస్ చీర బహుమతిగా ఇచ్చారని తెలిపింది. అది తనకి లభించిన ఒక లవ్లీ జెశ్చర్ అని పేర్కొంది. మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆ చీరను తాను ఇప్పటికీ దాచుకొని, ఎంతో ప్రత్యేకంగా చూస్తానంది.

ప్రభాస్ తనపై చూపిన నమ్మకం, ఇచ్చిన సపోర్ట్ తనకు ఎంతో ముఖ్యమని రిధి కుమార్‌ తెలిపింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కూడా ప్రభాస్ తనను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని ప్రశంసించాడని, అది తనకు ప్రపంచంతో సమానమని చెప్పింది. అలాగే బాహుబలి పార్ట్-2 తన ఫేవరెట్ తెలుగు సినిమా అని, ప్రభాస్, మారుతి తన ఫేవరెట్ హీరో, డైరెక్టర్ అని తెలిపింది. అటు ది రాజాసాబ్ విషయానికొస్తే.. సినిమా ఒక రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉంటుందని, ఇందులో హారర్, కామెడీ, రొమాన్స్, ఫన్, ఫ్రెండ్‌షిప్ లాంటి అన్ని ఎమోషన్స్ ఉంటాయని రిధి కుమార్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్
88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్