విలన్ రామిరెడ్డి క్యాన్సర్ వల్ల చనిపోలేదు.. సంచలన విషయం చెప్పిన నటుడు
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు విలన్ అంటే జనాలు దడుసుకునేవాళ్లు. స్క్రీన్ పైనే కాదు.. బయట కనిపించినా ప్రేక్షకులు భయంతో వణికిపోయేవారు. అంతగా తమ నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేశారు కొందరు నటులు. అందులో రామి రెడ్డి ఒకరు. ఈతరం ప్రేక్షకులకు ఆయన గురించి అంతగా తెలియదు.

టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన సీనియర్ విలన్ రామిరెడ్డి ఒకరు. చిన్నప్పుడు ఆయన్ను చూస్తే చాలు తెలియకుండానే దడ పుడుతుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆయన చనిపోయి చాలా కాలం అవుతున్నా కూడా ఆయన గురించి నిత్యం ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా రామిరెడ్డి జీవితం, ఆరోగ్యం, అద్భుతమైన సినీ ప్రస్థానంపై ప్రముఖ నటుడు విజయ రంగరాజు కీలక విషయాలు వెల్లడించారు. రామిరెడ్డి మరణానికి ముందు ఆయన ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్లతో పాటు, నటుడిగా ఆయన సాధించిన అసాధారణ విజయాలను రంగరాజు గుర్తుచేసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ రంగరాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ
విజయ రంగరాజు మాట్లాడుతూ.. రామిరెడ్డి క్యాన్సర్‌తో మరణించలేదని, డయాబెటిస్, లివర్ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. చివరి రోజుల్లో ఆయన శరీరం చాలా బలహీనంగా మారి, చూసేందుకు బక్కచిక్కిపోయి పేషెంట్ లాగా కనిపించేవారని విజయ రంగరాజు తెలిపారు. లివర్ సమస్యలకు ఆల్కహాల్ కూడా ఒక కారణమని అన్నారు. నటుడిగా రామిరెడ్డి ప్రస్థానం చాలా విలక్షణమైనదని.. ఒక చిత్రంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటుడు రాజశేఖర్ పక్కన నటిస్తున్నప్పుడు, రామిరెడ్డి తనకు నటన రాదని చెప్పి మూడుసార్లు లొకేషన్ వదిలి పారిపోయారని విజయ రంగరాజు గుర్తుచేసుకున్నారు. అయితే, దర్శకుడు కోడి రామకృష్ణ, రామిరెడ్డి గడ్డం, రూపం తన సినిమాకు సరిపోతాయని చెప్పి ఒప్పించారని తెలిపారు. ఆ సినిమాలో రక్తం కడిగే సన్నివేశం ప్రేక్షకులకు బాగా నచ్చి, రామిరెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని విజయ రంగరాజు తెలిపారు.
ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృషవంశీ
రామిరెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. బాలీవుడ్ లో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోలు సైతం నిలదొక్కుకోవడం కష్టమైన పరిస్థితుల్లో, రామిరెడ్డి తనదైన ముద్ర వేశారని విజయ రంగరాజు అన్నారు. రామిరెడ్డి జీవితం చివరి దశలో ఆయన అనారోగ్యం మరింత క్షీణించింది. సాయికుమార్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో విజయ రంగరాజు, తెలంగాణ శకుంతల, బాబు మోహన్ వంటి నటులతో పాటు రామిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో రామిరెడ్డి బలహీనమైన రూపాన్ని చూసి సాయికుమార్, బాబు మోహన్ కూడా చలించిపోయారు. ఆ షోలో రామిరెడ్డి తన గతాన్ని గుర్తుచేసుకుని సాయికుమార్ భుజంపై ఏడ్చేశారని రంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమం జరిగిన ఒకటి, రెండు నెలల తర్వాత రామిరెడ్డి కన్నుమూశారుని తెలిపారు.
EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




