Tollywood : ప్రభాస్, చిరంజీవి నిర్మాతలకు హైకోర్టులో ఊరట.. టికెట్స్ పెంపుపై నిర్ణయం ఏంటంటే..
ఈ ఏడాది సంక్రాంతి పండక్కి దాదాపు 7 సినిమాలు పోటీ పడనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ నవీన్ పోలిశెట్టి, రవితేజ, శర్వానంద్ ఇలా స్టార్స్ అందరి చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే తమ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.

రెండు బడా సినిమాలే. రెండూ కూడా సంక్రాంతి బరిలో దూసుతున్నవే. అయితే, టికెట్ రేట్లు పెరుగుతాయా? బెనిఫిట్ షోలు ఉంటాయా? ఈ అభ్యర్థనపై హైకోర్టు ఏం చెప్పబోతోంది? అనేది గత నిన్నటి నుంచి నెలకొన్న సందేహం. తాజాగా ఈ విషయంలో ది రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు పుష్ప 2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ 2 సినిమాలకే పరిమితం చేసింది. దీంతో ఇప్పుడు సంక్రాంతికి విడుదలయ్యే సినిమా నిర్మాతలుక ఊరట లభించినట్లైంది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
ఈసారి సంక్రాంతి పండక్కి భారీగానే సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఈ రెండు సినిమాల నిర్మాతలు వేరు వేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో టికెట్ ధరలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ రెండు సినిమాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్ వేశారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దర్శఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అయితే దీనిపై బుధవారం విచారణ జరిగింది.
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
ఈ విచారణలో గతంలో ఇచ్చిన తీర్పును ఆ చిత్రాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం. దీంతో ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించింది. కానీ హోంసెక్రటరీకి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేమని తేల్చింది హైకోర్టు. ఇప్పుడు హోంశాఖ అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదివరకే టికెట్ రేట్ల పెంపు కోసం తమ దగ్గరకి రావొద్దన్న మంత్రి కోమటిరెడ్డి.. ఇప్పుడు సంక్రాంతి సినిమాలపై ఫైనల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
