Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
భారతీయ సినిమా ప్రపంచంలో చెరగని అందమైన రూపం సౌందర్య. అందం.. అంతకు మించిన ప్రతిభతో కోట్లాది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. డాక్టర్ కావాల్సిన అమ్మాయి.. పదవ తరగతి పూర్తి కాగానే సినీరంగంలోకి అడుగుపెట్టింది. దక్షిణాదిలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

సౌందర్య.. ఇప్పటికీ సినీప్రియుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న పేరు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎలాంటి గ్లామర్ షో చేయకుండానే కొన్నేళ్లపాటు సినీరంగాన్ని శాసించిన ఏకైక హీరోయిన్. చక్కటి చీరకట్టులో సంప్రదాయం ఉట్టిపడేలా.. పదహారణాల తెలుగింటి అమ్మాయిగా కనిపించింది. దశాబ్దకాలం పాటు సినిమా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగింది. తక్కువ సమంయలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన సౌందర్య.. స్టార్ నటిగా ముద్ర వేసింది. కానీ ఊహించని విధంగా అందరిని షాక్ కు గురిచేస్తూ 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీని లోటు. మరణించే సమయానికి ఆమె రెండు నెలల గర్భవతి. సౌందర్యతోపాటు ఆమె సోదరుడు సైతం మరణించారు. ఇప్పటికీ సౌందర్యతో తమకున్న అనుబంధాన్ని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు సీనియర్ నటీనటులు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ ఆర్వీ ఉదయ్ కుమార్ సైతం సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నిజానికి సినీరంగానికి సౌందర్యను నటిగా పరిచయం చేసింది ఆయనే. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సినిమా ప్రపంచంలో సౌందర్యలాంటి అద్భుతమైన నటిని చూడడం చాలా అరుదు అని అన్నారు. ఏ సినిమాకు ఒప్పుకున్నా నేను చేయగలనా అనే సందేహం వ్యక్తం చేస్తుందని అన్నారు. సంవత్సరానికి పది సినిమాల్లో నటించే ఆమె.. ఎప్పుడు స్టార్ అనే ఆటిట్యూడ్ చూపించలేదని అన్నారు. రజినీకాంత్ నటించిన అరుణాచలం సినిమాకు ముందుగా కాల్షీట్ కూడా ఇవ్వలేనంతగా బిజీగా ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
అలాగే మరణించడానికి రెండు రోజుల ముందు 2004 ఏప్రిల్ 15న తన భార్య సుజాతకు సౌందర్య కాల్ చేసిందని.. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెప్పిందని అన్నారు. తనతో కూడా చాలా సేపు ఫోన్ మాట్లాడిందని.. ప్రచారానికి వెళ్లొ్చ్చాక కలుస్తానని చెప్పిందని.. అలసిపోయానంటూ ఫోన్ పెట్టేసిందని అన్నారు. కానీ కాసేపటికే సత్యరాజ్ సర్ తన దగ్గరకు వచ్చి సౌందర్య మరణించిందని చెప్పారని .. ఇప్పటికీ ఆమె మరణవార్తను తాను నమ్మలేకపోతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
