AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బుల్లేక అలా చేశాడు గానీ..! లేదంటే పెద్ద క్రికెటర్ అయ్యేవాడు.. ఆ టాలీవుడ్ హీరో ఎవరంటే..?

The Untold Story of a Dialogue King: టాలీవుడ్ నటుడు చిన్నతనంలోనే కుటుంబ ఆర్థిక బాధ్యతలు మోస్తూ, డబ్బింగ్ పనులలో నిమగ్నమయ్యారు. అయితే, ఆ బాధ్యతలు లేకుంటే ఆయన ఒక అగ్రశ్రేణి క్రికెటర్ అయ్యేవాడు. ఆయనో అద్భుతమైన ఆఫ్ స్పిన్నర్, తెలివైన బ్యాట్స్‌మన్. ఆయన తమిళనాడులో ఫస్ట్ డివిజన్ క్రికెట్ ఆడి, రంజీ ఆడగల సత్తా ఉందని అప్పట్లో గుర్తింపు పొందాడు.

డబ్బుల్లేక అలా చేశాడు గానీ..! లేదంటే పెద్ద క్రికెటర్ అయ్యేవాడు.. ఆ టాలీవుడ్ హీరో ఎవరంటే..?
The Untold Story Of A Dialogue King
Venkata Chari
|

Updated on: Jan 06, 2026 | 11:33 AM

Share

The Untold Story of a Dialogue King Actor Sai Kumar: డాక్టర్ కావాలనుకుని, యాక్టర్ అయ్యామని చాలామంది స్టార్స్ చెబుతుంటారు. ఇలాగే చాలామంది అనుకోని యూటర్న్ తీసుకుని తమ ప్రోపెషన్ మార్చుకున్నట్లు కూడా చూశాం. తాజాగా ఇలాంటి ఓ యాక్టర్ గురించి తెలుసుకుందాం. అయితే, ఈయన డాక్టర్, లాయర్ కాకుండా ఓ క్రికెటర్ అవ్వాలని కోరుకున్నాడు. కానీ, కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓ యాక్టర్‌గా మారిపోయాడు. తన కుటుంబం కోసం పెద్ద బాధ్యతను తన భుస్కందాలపై వేసుకుని అండగా నిలిచి, తన కలలను త్యాగం చేశాడు. ఆయితే, సినీ రంగంలోనూ తనదైన స్టైల్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ఆయనెవరో చూద్దాం..

నటుడు సాయి కుమార్ అద్భుతమైన క్రికెటర్ అయ్యే అవకాశం కోల్పోయారా? ఈ ప్రశ్నకు నటుడు సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప పి. శర్మ ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఆయన ప్రకారం, సాయి కుమార్ చిన్నతనంలోనే తీవ్రమైన కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. ఇంట్లో 12-13 మంది సభ్యులు ఉండేవారు, తండ్రి సంపాదన మాత్రమే కుటుంబానికి సరిపోదు. ఈ పరిస్థితుల్లో చిన్న వయసులోనే సాయి కుమార్ ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలిచారు.

ఇది కూడా చదవండి: IND vs NZ: తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్.. ప్లేయింగ్ 11లో షాకింగ్ మార్పు?

ఇవి కూడా చదవండి

స్కూలు నుంచి రాగానే హోమ్‌వర్క్ పూర్తి చేసుకుని డబ్బింగ్ పనులకు వెళ్ళేవారు. ఈ బాధ్యతలు లేకపోయుంటే, సాయి కుమార్ ఒక గొప్ప క్రికెటర్ అయ్యేవారని అయ్యప్ప పి. శర్మ అన్నారు. ఆ రోజుల్లో సాయి కుమార్ అద్భుతమైన ఆఫ్ స్పిన్నర్, తెలివైన బ్యాట్స్‌మన్. ఆయన తమిళనాడులో ఫస్ట్ డివిజన్ క్రికెట్ ఆడి, రంజీ స్థాయికి అవసరమైన అన్ని అర్హతలు పొందారు. కుటుంబ బాధ్యతలు తన క్రికెట్ కలను కొనసాగించకుండా అడ్డుకున్నాయని ఆయన తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..