AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?: పాకిస్తాన్ టీం పరువు తీసిన మాజీ కోచ్

Former Pakistan Coach Gillespie Slams PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని అరాచక పరిస్థితులు, రాజకీయ జోక్యంపై మాజీ కోచ్ జాసన్ గిలెస్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పీసీబీ చైర్మన్ మహ్సిన్ నఖ్వీ తనను అవమానించారని, జట్టు ఎంపికలో తన ప్రమేయం లేకుడా చేశారని ఆరోపించాడు. బోర్డు అస్థిరత వల్లే జట్టు వైఫల్యాలు ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నాడు.

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?: పాకిస్తాన్ టీం పరువు తీసిన మాజీ కోచ్
Pakistan
Venkata Chari
|

Updated on: Jan 05, 2026 | 8:23 AM

Share

Former Pakistan Coach Gillespie Slams PCB: పాకిస్తాన్ క్రికెట్‌లో నెలకొన్న అరాచక పరిస్థితులు, రాజకీయ జోక్యంపై ఆ జట్టు మాజీ టెస్ట్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం జాసన్ గిలెస్పి తీవ్ర విమర్శలు గుప్పించాడు. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహ్సిన్ నఖ్వీ తనను తీవ్రంగా అవమానించాడని, కోచ్‌గా తనకు ఉండాల్సిన కనీస గౌరవం, స్వయం ప్రతిపత్తిని హరించారని గిలెస్పి ఆరోపించడం గమనార్హం. పాకిస్తాన్ క్రికెట్ పతనం కావడానికి గల చీకటి నిజాలను ఆయన మీడియా వేదికగా వెల్లడించి షాకిచ్చాడు.

జట్టు ఎంపికలో కోచ్‌లకు కీలక పాత్ర ఉంటుందని ఒప్పందం ఉన్నప్పటికీ, పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించి కోచ్ అధికారాలను పూర్తిగా తగ్గించిందని గిలెస్పి వాపోయారు. తనను కేవలం మైదానంలో పర్యవేక్షించే వ్యక్తిగా మార్చారని, జట్టు ఎంపికలో ఎలాంటి సంబంధం లేకుండా చేశారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ కోచ్‌ను ఇలా అవమానించడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని గిలెస్పి తెలిపాడు. బోర్డు నిర్ణయాలు క్రికెట్ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించాడు.

జట్టు కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత..

పాకిస్తాన్ క్రికెట్‌లో నెలకొన్న అరాచక పరిస్థితులు, రాజకీయ జోక్యంపై ఆ జట్టు మాజీ టెస్ట్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం జాసన్ గిలెస్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహ్సిన్ నఖ్వీ తనను తీవ్రంగా అవమానించాడని, కోచ్‌గా తనకు ఉండాల్సిన కనీస గౌరవం, స్వయం ప్రతిపత్తిని తీసేశారని గిలెస్పి ఆరోపించాడు. పాకిస్తాన్ క్రికెట్ పతనం కావడానికి గల చీకటి నిజాలను ఆయన తాజాగా మీడియా వేదికగా ఎండగట్టాడు.

ఇవి కూడా చదవండి

కోచ్ పని జీరో..

గిలెస్పి పాకిస్తాన్ టెస్ట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తారని ఒప్పందం జరిగింది. అయితే, కొద్ది రోజుల్లోనే పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించి కోచ్ అధికారాలను పూర్తిగా తగ్గించింది. “నన్ను కేవలం మైదానంలో పర్యవేక్షించే వ్యక్తిగా మార్చారు. జట్టు ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేకుండా చేశారు. ఒక అంతర్జాతీయ కోచ్‌ను ఇలా అవమానించడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని” గిలెస్పి వాపోయారు.

నఖ్వీ పంతంతో జట్టు ఆగమాగం..

అలాగే, పీసీబీ చైర్మన్ మహ్సిన్ నఖ్వీ తీరుపై గిలెస్పి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బోర్డు నిర్ణయాలు క్రికెట్ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నఖ్వీ, బోర్డు సభ్యులు కోచ్‌లకు తగిన గౌరవం ఇవ్వరని, నిర్ణయాలు తీసుకోవడంలో కోచ్‌ల అభిప్రాయాలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోరని గిలెస్పి పేర్కొన్నారు. “నేను ఒక ప్రణాళికతో వచ్చినప్పుడు దాన్ని అమలు చేసే అవకాశం ఇవ్వకుండానే నాపై విమర్శలు చేశారు. ఇటువంటి వాతావరణంలో పనిచేయడం అసాధ్యం” అని గిలెస్పి వెల్లడించారు.

డ్రెస్సింగ్ రూమ్‌లోనూ అభత్రతా భావం..

పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వైఫల్యాలకు బోర్డులోని అస్థిరతే ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. ఆటగాళ్లలో ప్రతిభ ఉందని, కానీ బోర్డులో ప్రతి వారం నిర్ణయాలు మారుతూ ఉంటాయని ఆయన తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్‌లో భద్రతా భావం లేకపోవడం వల్ల ఈ గందరగోళం ఆటగాళ్ల ప్రదర్శనను దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. తనను కూడా అర్ధాంతరంగా తప్పించడం వారి అస్థిరతకు నిదర్శనమని గిలెస్పి పేర్కొన్నారు. కేవలం కొన్ని పరాజయాలకే కోచ్‌లను మార్చడం వల్ల జట్టు ఎప్పటికీ స్థిరపడదని ఆయన హెచ్చరించారు. గిలెస్పి వంటి నిజాయితీ గల కోచ్‌ను పాక్ బోర్డు కోల్పోవడంపై అభిమానులు కూడా పీసీబీపై మండిపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ క్రికెట్ పరువు పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన పద్ధతులను మార్చుకోకపోతే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని గిలెస్పి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..