IND vs NZ: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.?
India vs New Zealand, 1st ODI: విరాట్ కోహ్లీ లేకపోవడం ఢిల్లీ జట్టుకు లోటు అయినప్పటికీ, కెప్టెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉండటం ఊరటనిచ్చే అంశం. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు పంత్ కూడా ఎంపికయ్యాడు. అయితే నేషనల్ డ్యూటీలో చేరడానికి ముందు ఆయన రైల్వేస్‌తో ఈ మ్యాచ్ ఆడతారని సమాచారం. పంత్ ఇప్పటివరకు ఢిల్లీ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పాల్గొని జట్టును బలోపేతం చేశారు.

India vs New Zealand, 1st ODI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 11 నుంచి వడోదరలో ప్రారంభం కానుంది. ఈ కీలక సిరీస్ కోసం భారత జట్టులోకి ఇద్దరు దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి రావడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. అనుభవజ్ఞుడైన బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కోహ్లీ పునరాగమనం ఈ సిరీస్‌లో అత్యంత కీలకమైన అంశంగా భావిస్తున్న తరుణంలో, ఆయన అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వన్డే మ్యాచ్‌కు ముందు దూరమైన విరాట్ కోహ్లీ ఒకవైపు భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభం కానుండగా, మరోవైపు విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రైల్వేస్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌లో ఆడటం లేదు.
టోర్నమెంట్‌లో ఆరో రౌండ్‌లో భాగంగా జనవరి 6న ఆలూర్‌లోని KSCA త్రీ ఓవల్స్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. కోహ్లీ గైర్హాజరీకి సంబంధించి ఎలాంటి అధికారిక కారణం వెల్లడి కాలేదు. కానీ, దీనిని న్యూజిలాండ్ సిరీస్ సన్నద్ధతలో భాగంగానే చూస్తున్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీ గతంలో కోహ్లీ ఆడతారని సంకేతాలిచ్చినప్పటికీ, ఈ నిర్ణయం ఢిల్లీ జట్టుకు షాక్ ఇచ్చింది. టోర్నీ ప్రారంభంలో రెండు మ్యాచ్‌లాడిన కోహ్లీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ బాదారు, కానీ వ్యక్తిగత కారణాలతో గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు.
న్యూజిలాండ్ సిరీస్‌పైనే పూర్తి ఫోకస్..
విరాట్ కోహ్లీ ఇప్పుడు నేరుగా జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లోనే మైదానంలోకి దిగుతారని భావిస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే మెగా టోర్నీల సన్నద్ధత దృష్ట్యా ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం. కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ తన దృష్టిని దేశవాళీ క్రికెట్ నుంచి మళ్లించి నేరుగా అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడం టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహంలో భాగంగా ఉండవచ్చు. అందుకే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ను వదిలేయడం ఒక ఆలోచనాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది.
బీసీసీఐ నిబంధనలు – కోహ్లీ డొమెస్టిక్ రికార్డ్..
సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ నిబంధన విధించింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడి ఆ నిబంధనను పూర్తి చేశారు. కాబట్టి తదుపరి మ్యాచ్‌లు ఆడటం ఆయనకు తప్పనిసరి కాదు. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ, రెండో మ్యాచ్‌లో 77 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




