Actor Venkat : ఆ కారణంతోనే ఇండస్ట్రీకి అందుకే దూరమయ్యాను.. హీరో వెంకట్ కామెంట్స్..
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోస్ చాలా మంది ఉన్నారు. వరుసగా అందమైన ప్రేమకథలతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందులో హీరో వెంకట్ ఒకరు. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు.

హీరో వెంకట్.. ఈతరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు తెలుగు సినీరంగంలో లవర్ బాయ్. ప్రేమకథ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి మూవీతో తెలుగులో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన అన్నయ్య చిత్రంలో రవితేజతో కలిసి నటించారు. తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలతో నటుడిగా పాపులర్ అయ్యాడు. కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. తక్కువ సమయంలోనే హీరోగా ఎదిగిన వెంకట్.. ఆ తర్వాత సినిమాల చేయడం ఆపేశాడు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
“ఓజీ” చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా, అందులో ప్రత్యేక పాత్ర పోషించిన నటుడు వెంకట్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆయనను కేవలం నటుడిగానే కాకుండా ఒక నిజాయితీ గల నాయకుడిగా తాను గౌరవిస్తానని అన్నారు. “ఓజీ” చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినప్పటికీ, లీడర్ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉందని వెంకట్ అన్నారు. పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాల్సిన ఒక కీలక సన్నివేశం గురించి వివరిస్తూ.. మొదట భయపడ్డానని.. పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా డైరెక్టర్‌కు ఒక్కసారి కూడా చూడకుండా ఓకే చేశారని వెల్లడించారు. తాను “ఓజీ” చిత్రంలో నటించడం పవన్ కళ్యాణ్ అనుమతితోనే జరిగిందని సుజిత్ ద్వారా తెలిసిందని తెలిపారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల షూటింగ్ లొకేషన్‌లో మాట్లాడే అవకాశం లభించలేదని, అయితే బాంబేలో జరిగిన కాలర్ పట్టుకునే సీన్ చిత్రీకరణ సమయంలో ఆయన కాస్త రిలాక్స్‌గా ఉన్నారని, అప్పుడు శుభాకాంక్షలు చెప్పే అవకాశం దొరికిందని అన్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
గతంలో చిరంజీవితో “అన్నయ్య” సినిమాలో నటించడం తన కెరీర్‌లో ఒక మైలురాయి అని, అప్పటికి తాను పరిశ్రమకు కొత్త అయినప్పటికీ, చిరంజీవి గారి గొప్ప సహకారంతో ఎంతో సౌకర్యవంతంగా పని చేయగలిగానని గుర్తు చేసుకున్నారు. రవితేజతో కూడా ఆ సినిమాలో సన్నిహితంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఒక పెద్ద బడ్జెట్ బ్లాక్‌బస్టర్ చిత్రంలో విలన్ పాత్రను మిస్ చేసుకున్నానని, అప్పట్లో హీరోలు విలన్ పాత్రలు చేసే ట్రెండ్ లేకపోవడం, తన వెన్నెముక గాయం (బ్యాక్ ఇంజ్యూరీ) కారణంగా కొన్ని సినిమాలు కోల్పోయానని వెంకట్ బాధను వ్యక్తం చేశారు. ఇకపై చిన్న చిన్న సహాయ పాత్రలు చేయదలచుకోలేదని, హీరో లేదా ప్రధాన విలన్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ వంటి పెద్ద స్టార్స్ కాంబినేషన్‌లో అయితేనే సహాయ పాత్రలు చేస్తానని తెలిపారు. జగపతి బాబు, శ్రీకాంత్, తేజ సజ్జా వంటి నటులు తమ కెరీర్‌లో మార్పులు చేసుకుని విజయాలు సాధించారని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
