Prabhas: చక్రం డిజాస్టర్ తర్వాత ప్రభాస్ తనతో ఎలా ఉన్నాడంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్..
దర్శకుడు కృష్ణవంశీ చక్రం పరాజయం తర్వాత ప్రభాస్ ఎలా బిహేవ్ చేశాడన్న విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇండస్ట్రీలో బంధాలు కేవలం వ్యాపార భాగస్వామ్యాలేనని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఆయన ఇంకేం అన్నారో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ ఇండస్ట్రీలోని వ్యక్తిగత, వృత్తిపరమైన బంధాలపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కోసం లేదా ఎమోషన్ బాండింగ్ విషయంలోనే నటీనటులు, దర్శకుల మధ్య బంధాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. దర్శకుడి కల్పనకు, భావాలకు హీరో శారీరక రూపం ఇస్తాడని తద్వారా ఓ సినిమా రూపొందుతుందని అన్నారు. అలా వారి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందన్నారు. అయితే, సినిమా విడుదలయ్యాక విజయం ఆధారంగా ఈ రిలేషన్ మారుతుందని.. విజయం ప్రేమను, గౌరవాన్ని పెంచగా.. వైఫల్యం ద్వేషానికి దారి తీస్తుందని కృష్ణవంశీ అన్నారు. చక్రం మూవీ డిజాస్టర్ అయినప్పటికీ.. నటుడు ప్రభాస్ తన గురించి ఎప్పుడూ తప్పుగా చెప్పలేదని.. కలిసిన ప్రతిసారీ గౌరవంగా మాట్లాడారని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోని బంధాలన్నీ కూడా ‘వ్యాపార భాగస్వామ్యాలు’ అని ఆయన తెలిపారు. ‘ఎవ్వడూ ఊరికనే కళాసేవ చేయట్లేదు. ప్రజా సేవ చేయట్లేదు. ఎవడి ఎజెండాలో వాడుంటాడు’ అని ఆయన స్పష్టం చేశారు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
తనతో తాను గడపడం, సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం తనకు ఇష్టమన్నారు దర్శకుడు కృష్ణవంశీ. తన భార్య రమ్యకృష్ణ, కొడుకుతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటానని చెప్పుకొచ్చారు. నటుడు ఉత్తేజ్ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు ‘నా పేరులో సగం వాడు’ అని చెప్పిన కృష్ణవంశీ.. ఆ తర్వాత కాలక్రమేణా సంబంధాలు మారతాయని, ‘మానవ సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు’ అని స్పష్టం చేశారు. ఉత్తేజ్‌ను దర్శకుడిగా మార్చడానికి ప్రయత్నించిన విషయాన్ని కూడా కృష్ణవంశీ వివరించారు. ఉత్తేజ్ కలం గొప్పదని, తన ఆలోచనలకు, అభిప్రాయాలకు దగ్గరగా రాయగలడని ఆయన ప్రశంసించారు. అయితే, ఉత్తేజ్ స్వతహాగా నటుడు కావడంతో, “మల్లెపువ్వు” అనే చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి ఇష్టపడలేదని తెలిపారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత ‘చందమామ’ మూవీగా రూపొందిందని చెప్పారు. సినిమా అనేది కేవలం ఉద్యోగం కాదని, అది నిరంతరం కొనసాగే మానసిక ప్రక్రియ అని కృష్ణవంశీ అభిప్రాయపడ్డారు.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




