AR Rahman : 30 ఏళ్లుగా సంగీత ప్రపంచంలో రారాజు.. ఒక్కో పాటకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. రెహమాన్ ఆస్తులు తెలిస్తే..
దాదాపు మూడు దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో రారాజు. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. రోజా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మొదలైన ప్రయాణం ఇప్పటికీ నిరంతరంగా సాగుతూనే ఉంది. ఎన్నో వందల పాటలను అందించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

సినీరంగంలో అగ్ర సంగీత దర్శకులలో ఏఆర్ రెహమాన్ ఒకరు. దాదాపు 30 ఏళ్లుగా సినిమా ప్రపంచంలో సంగీత రారాజుగా వెలుగుతున్నారు. ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన చికిరి సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టి్స్తుంది. ఏఆర్ రెహమాన్ ను మ్యూజికల్ స్టార్మ్ అని పిలుస్తాము. ఆయన ఏ భాషలోనైనా సంగీతం ద్వారా మానవ భావోద్వేగాలను తెలియజేస్తాడు. 1992 లో విడుదలైన ‘రోజా’ చిత్రంతో ఆయన సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేశారు. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలతో అలరించాడు. ఆస్కార్ అవార్డు , గోల్డెన్ గ్లోబ్ అవార్డు, జాతీయ చలనచిత్ర అవార్డు వంటి ప్రసిద్ధ అవార్డులను గెలుచుకున్నారు .
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
హాలీవుడ్ చిత్రం స్లమ్‌డాగ్ మిలియనీర్‌కు సంగీతం అందించినందుకు ఆయన ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే 2008లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్టా అవార్డును కూడా గెలుచుకున్నారు. రెండు అవార్డులను అందుకున్న తొలి భారతీయుడు ఆయన. 2010లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును అందించింది. ఆయనను ఆసియా మొజార్ట్ అని కూడా పిలుస్తారు. సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేసి 30 సంవత్సరాల గడిచినా ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
నివేదికల ప్రకారం ఆయన ఒక్కో సినిమాకు ₹10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే గంటసేపు మ్యూజిక్ కచేరికి దాదాపు 2 కోట్లు పారితోషికం తీసుకుంటారు. అలాగే ఒక్కో పాటకు రూ.3 కోట్ల వరకు వసూలు చేస్తారట. ఆయన ఆస్తుల విలువ రూ. 1,712 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. లాస్ ఏంజిల్స్, దుబాయ్, చెన్నై, ఇతర ప్రాంతాలలో అనేక కోట్ల రూపాయల విలువైన లగ్జరీ బంగ్లాలను ఎ.ఆర్. రెహమాన్ కలిగి ఉన్నారు. బెంజ్, జాగ్వార్, పోర్స్చే వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
