Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
ఆనందం హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో సినీప్రియులను ఆకట్టుకుంటుంది. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె .. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తెలుగులో ఒకప్పుడు అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో రేఖ ఒకరు. ఆనందం సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమోగింది. 2001లో ఆనందం, 2002లో ఒకటో నెంబర్ కుర్రోడు వంటి తెలుగు చిత్రాలతో గుర్తింపు పొందిన రేఖ, తర్వాత కన్నడ చిత్రాలపై ఫోకస్ చేసింది. 2014 నుండి వ్యక్తిగత కారణాలతో, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆమె సినీ రంగానికి దూరమయ్యారు. ఇటీవల ఓ ఇంటర్య్వలో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం, వైద్య ఖర్చులు, ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
రేఖ తన కెరీర్‌ను చాలా చిన్న వయస్సులోనే ప్రారంభించారు. కుటుంబం నుండి ఎటువంటి సినీ నేపథ్యం లేకపోవడం వల్ల సరైన మార్గదర్శకత్వం లేక తెలుగులో పెద్దగా కొనసాగలేకపోయానని అన్నారు. కన్నడ సినీ అవకాశాలు రావడంతో అటువైపు దృష్టి సారించి 2014 వరకు అక్కడే ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో సినీ రంగానికి దూరమయ్యానని అన్నారు. ప్రీకోవిడ్ సమయంలో తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో మూడు సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవలసి వచ్చిందని.. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఆమె వెల్లడించారు. చాలా నరకం అనుభవించానని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
ఆరోగ్య సమస్యల గురించి పూర్తిగా వెల్లడించలేదు. ఎవరైనా సమస్యలు ఎదురైనప్పుడు చాలా మంది పట్టించుకోరని, మరికొందరు సంతోషిస్తారని, కాబట్టి వాటి గురించి మాట్లాడటం అనవసరమని తెలిపారు. ఈ కష్టాల నుండి బయటపడటానికి దైవబలం మాత్రమే తనకు తోడు నిలిచిందని అన్నారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నానని, పెళ్లి చేసుకోలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
