Dil Raju: ‘ఆ స్టార్ హీరోతో మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది.. డేట్స్ ఇస్తే ఇతర సినిమాలన్నీ కూడా..’
నిర్మాత దిల్ రాజు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు నచ్చిన హీరోల గురించి మాట్లాడారు. ఆ విషయాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఓ సారి లుక్కేయండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా.. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు సైన్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరోల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తాను పని చేసిన హీరోలపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్టార్ హీరోలలో అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ అని, జూనియర్ ఎన్టీఆర్ స్మార్ట్ అని చెప్పుకొచ్చారు. ఈ హీరోతో వర్క్ చేయకూడదనే వాళ్లు ఉండొచ్చునని.. కానీ ఆ పేర్లు చెప్పానని దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో తెగేసి చెప్పారు.
తాను ప్రెస్ మీట్‌లలో విషయాలను ఓపెన్‌గా చెప్పడం వల్ల కొందరు హర్ట్ అవుతారన్నారు దిల్ రాజు. అలాగే తాను మళ్లీ మళ్లీ పని చేయాలనిపించే హీరో పవన్ కళ్యాణ్ అని తెలిపారు . ఆయన డేట్స్ దొరికితే ఇతర సినిమాలన్నీ వదిలేసి మరీ సినిమా చేస్తానని చెప్పారు. తనకు సంతృప్తినిచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయని.. నష్టాలు మిగిల్చిన సినిమాలు కొన్ని ఉన్నా.. ఇండస్ట్రీలో అలాంటిది సర్వసాధారణం అన్నారు. చివరిగా, తన జీవితంలో ఒక్కడు సినిమా చూసి, తాను ప్రొడ్యూసర్‌గా అయినప్పుడు అలాంటి సినిమా తీయాలనుకున్నానని నిర్మాత దిల్ రాజు అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




