Tollywood : హిట్లకు కేరాఫ్ అడ్రస్.. రూ.500 కోట్ల ఆస్తులు.. ఇండస్ట్రీని ఏలేస్తోన్న హీరోయిన్..
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో వరుస హిట్లతో జోష్ మీదున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ముద్దుగుమ్మ ఒకరు. తల్లైనా తగ్గేదే లే అంటూ బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు ఆమె ఆస్తులు రూ.500 కోట్లు ఉన్నట్లు టాక్.

సినిమా ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్దిమంది హీరోయిన్స్ మాత్రమే సక్సెస్ అయ్యారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ దీపికా పదుకొణే. బెంగుళూరుకు చెందిన ఈ అమ్మడు నార్త్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. జనవరి 5న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా గత 24 గంటలుగా సోషల్ మీడియాలో దీపికా పేరు మారుమోగుతుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతుంది. 2007లో షారుఖ్ ఖాన్ ‘ఓం శాంతి ఓం’ సినిమాతో దీపిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో రాత్రికి రాత్రే స్టా్ర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. 2018లో వచ్చిన పద్మావత్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్ స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే ప్రభాస్ నటించిన కల్కి పార్ట్ 1 చిత్రంలోనూ కనిపించింది. ఇప్పుడు ఆమె అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో కనిపించనుంది. అలాగే పఠాన్ 2లోనూ కనిపించనుంది. ఇవే కాకుండా అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టులోనూ నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
19 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న దీపికా ఆస్తులు రూ.500 కోట్లు ఉన్నట్లు సమాచారం. నటిగానే కాకుండా ఆమె మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడంలో ముందుంటుంది. ఇందుకోసం ఆమె 2015లో ‘ది లైవ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ఈ సేవలకు గాను 2018లో ‘టైమ్’ మ్యాగజైన్ ప్రకటించిన ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు’ జాబితాలో పేరు పొందింది. ఆమెకు ‘టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డు’ కూడా లభించింది. ప్రస్తుతం ఆమెకు ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు తీసుకుంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
