Jr NTR: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
అటు హీరోగా, ఇటు విలన్‌గా.. టాలీవుడ్ నటుడు జగపతిబాబు సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా ఫ్యామిలీ ప్రేక్షకులను సొంతం చేసుకున్న ఆయన.. ఆ తర్వాత విలక్షణ నటుడిగా పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

టాలీవుడ్ నటుడు జగపతిబాబు గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. తన అసలు పేరు వీరమాచినేని జగపతి రావు చౌదరి అని చెప్పిన ఆయన.. తనను జగపతిబాబు లేదా జె.బి. అని పిలిస్తే నచ్చుతుందని అన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తనకు లభించిన రోల్స్.. తనను పాన్-ఇండియా స్థాయిలో నిలబెట్టాయని అన్నారు. హీరోగా అందని అవకాశాలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లభిస్తున్నాయన్నారు. తానొక నటుడిని మాత్రమేనని.. హీరో అనే ట్యాగ్‌ను వదులుకోవడం సులువని జగపతిబాబు తెలిపారు. తన రెండో ఇన్నింగ్స్‌లో శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, గూఢచారి, అఖండ లాంటి విజయవంతమైన చిత్రాలలో నటించడం తన అదృష్టమని పేర్కొన్నారు. సినిమా కేవలం హీరో చుట్టూ తిరగకూడదని, స్క్రిప్ట్, క్యారెక్టర్లే హీరోలని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో జ్యోతిష్యం, హస్తసాముద్రికంపై ఆసక్తి ఉండేదని.. కానీ కొన్ని చెడు సంఘటనలు జరిగిన తర్వాత వాటిని పక్కన పెట్టానని జగపతిబాబు చెప్పారు. సమయాన్ని బలంగా నమ్ముతానని, జీవితంలో జరిగిన మంచి చెడులన్నీ కాలం ప్రభావమేనని వివరించారు. తనకు రామ్ గోపాల్ వర్మ మంచి స్నేహితుడని.. ఇద్దరి మధ్య తరచుగా సరదాగా గొడవలు జరుగుతాయని అన్నారు. ఒకసారి గాయం సినిమా షూటింగ్ సమయంలో ఊర్మిళపై తన అభిప్రాయం చెప్పినప్పుడు.. వర్మ దానిని ఒక పెద్ద గొడవగా మార్చి.. చివరకు తాను తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడంతో సినిమా ముందుకు సాగిందని జగపతిబాబు చెప్పుకొచ్చారు. అలాగే అరవింద సమేత సమయంలో ఎన్టీఆర్ తనకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారని తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక తన క్యారెక్టర్ కంటే.. బసిరెడ్డి క్యారెక్టర్‌నే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారని చెప్పాడని.. ఎన్టీఆర్‌నే కష్టపెట్టారు.. ఇంకో నాలుగేళ్లు నీ మొహం నాకు చూపించకు అని తారక్ ఫన్నీగా అన్నాడని హీరో జగపతిబాబు వెల్లడించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




