Lifestyle: రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగినట్టే.! ఆ వ్యాధికి సంకేతాలే ఇవి..
ఉరుకుల పరుగుల జీవితం, ఎప్పుడు.. ఏది తింటున్నామో తెలియని పరిస్థితుల్లో.. ఇప్పుడు అందరూ కూడా రోగాల బారిన పడుతున్నారు. తినే ఫుడ్‌లో కూడా సరైన పోషకాలు లేకపోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.

రాత్రిపూట కనిపించే డయాబెటిక్ లక్షణాలు చాలా ముఖ్యమైనవి. వాటిని అస్సలు ఇగ్నోర్ చేయకండి. తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు లాంటి లక్షణాలు మీకు నైట్‌లో కనిపిస్తే.. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. కొన్నిసార్లు లో డయాబెటిస్ వల్ల కూడా చెమటలు, పీడకలలు కూడా రావచ్చు. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పుడు చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య డయాబెటిస్. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. ముఖ్యంగా రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాలు డయాబెటిస్‌ను సూచించవచ్చు. వీటిని సకాలంలో గుర్తించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన కావడం ప్రధాన లక్షణాలలో ఒకటి. అధిక షుగర్ స్థాయిలను శరీరం మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నించడం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో కొందరు రాత్రికి రెండు, మూడు సార్లు నిద్రలేచి బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీనితో పాటు, అధిక దాహం కూడా షుగర్ వ్యాధికి ఒక స్పష్టమైన సంకేతం. నోరు పొడిబారడం కూడా దీనికి సంకేతమే.
కండరాల నొప్పులు, కాళ్ల తిమ్మిర్లు లేదా మంటలు రాత్రిపూట అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ నొప్పులు నిద్రకు భంగం కలిగించవచ్చు. అదనంగా, కొంతమందికి రాత్రిపూట అధిక చెమటలు పట్టడం లేదా పీడకలలు రావడం లాంటివి ఉంటాయి. ఇది కొన్నిసార్లు హైపోగ్లైసీమియా(షుగర్ స్థాయిలు పడిపోవడం) వల్ల సంభవించవచ్చు. ముఖ్యంగా మందుల మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు. నిద్రలో అవాంతరాలు, విపరీతమైన ఆకలి కూడా డయాబెటిస్ సంకేతాలు కావచ్చు. ఈ రాత్రిపూట కనిపించే లక్షణాలను విస్మరించకూడదు. మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




