పాము గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
గుడ్డు సంపూర్ణ పోషకాహారంగా పిలుస్తారు. ప్రతి రోజూ ఒక గుడ్డు తినమని వైద్యులు కూడా సూచిస్తున్నారు. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. దీంతో దాదాపుగా అందరూ రోజూ గుడ్లు తినటం అలవాటు చేసుకున్నారు. దీంతో కోడి గుడ్లకు క్రేజ్ పెరిగింది. కొందరు వాటిని ఆమ్లెట్‌లుగా తింటారు. కొందరు ఉడికించి తింటారు. మరికొందరు ఇతర ఆహారాలు మ్యాగీ, బ్రెడ్ వంటి వాటితో మిక్స్ చేసి తీసుకుంటారు. అయితే, ఇప్పుడేందుకు ఈ గుడ్డు ప్రస్తవన అనుకుంటున్నారా..? ప్రస్తుతం చర్చించనీయాంశంగా మారిన విషయం ఏంటంటే..మనుషులు పాము గుడ్లు తినవచ్చా..? తింటే ఏమౌతుందో ఇక్కడ చూద్దాం...

చాలా మంది ఆహార ప్రియులు కోడి గుడ్డుతో పాటుగా బాతులు, ఉష్ట్రపక్షి వంటి ఇతర పక్షుల గుడ్లను కూడా తింటారు. ఇతర విదేశాలలో కొన్ని వర్గాల ప్రజలు పాము గుడ్లు తింటారని మనం చదువుతాము లేదా వింటాము. కానీ, ఇది నిజంగా సాధ్యమేనా? పాము గుడ్లు తినడం సాధారణమేనా? అంటే కొందరు స్నేక్ క్యాచర్లు, నిపుణులు షాకింగ్ విషాయాలను వెల్లడించారు. పాము గుడ్లు తినడం అసాధారణం అంటున్నారు. కానీ, మనుషులు పాము గుడ్డు తింటే అనేక సమస్యలు తలెత్తె అవకాశం ఉంటుందని అంటున్నారు. పాము గుడ్లలో బ్యాక్టీరియా, పరాన్నజీవులు ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజన్, ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు, పాము గుడ్లలో సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషంగా మార్చేస్తుంది. కొంతమందికి పాము గుడ్లకు అలెర్జీ కూడా ఉంటుంది. దీని వలన చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు, అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా వస్తాయి. పాము గుడ్లు విషపూరితమైనవి కావు, కాబట్టి వాటిని తినడం వల్ల మరణం సంభవించదు అని చెబుతున్నారు. పాము దంతాల వెనుక ఉన్న గ్రంథులలో విషం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి చాలా పాము గుడ్లు విషరహితంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇది గుడ్లలో నేరుగా కనిపించదు. అయితే, గుడ్లు పిండాలుగా అభివృద్ధి చెందితే, అవి విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది. పాము గుడ్లు పెట్టినప్పుడు, అవి విషరహితంగా ఉంటాయి. అందువల్ల, పాము గుడ్లు తినడం వల్ల విషం వచ్చే ప్రమాదం చాలా తక్కువ.
అయితే, భారతదేశంలో పాములను మతపరంగా గౌరవించి పూజిస్తారు. కాబట్టి వాటి గుడ్లు తినడం ఊహించలేము. విదేశాలలో ఇది సర్వసాధారణం. కాబట్టి, ఎవరైనా పాము గుడ్లు తినాలనుకుంటే, బ్యాక్టీరియా, పరాన్నజీవులను నాశనం చేయడానికి వాటిని పూర్తిగా ఉడికించాలని చెబుతున్నారు. పాము గుడ్లు తినడం సాధ్యమేనని, పోషక విలువలను కలిగి ఉండవచ్చని పరిశోధనలో తేలింది. అయితే ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీ ప్రతిచర్యలు వంటి అనేక సంభావ్య ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగి ఉంటుంది. ఇంకా, సాంస్కృతిక, నైతిక, చట్టపరమైన సమస్యలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
1972 నాటి భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగించడం శిక్షార్హమైన నేరమని మహాదేవ్ పటేల్ వివరించారు. ఎవరైనా పాము గుడ్లు తినాలనుకుంటే, వారు జాగ్రత్తగా తినాలని మరియు సంభావ్య ప్రమాదాల గురించి తెలుసుకోవాలని అన్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏదైనా కొత్తగా ఆహారం ట్రై చేయాలనుకున్న నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




