AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chapati Vs Rice: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి..

డయాబెటిస్ రోగులకు అన్నం, చపాతీలలో ఏది మంచిది.? అందరిలోనూ ఇదే ప్రశ్న. ఒక కప్పు అన్నంలో 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటే, ఒక చపాతీలో 15 గ్రాములు ఉంటాయి. చపాతీలో 2 గ్రాముల ఫైబర్ అదనంగా ఉంటుంది. ఆ వివరాలు ఇలా..

Chapati Vs Rice: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి..
Chapati Vs Rice
Ravi Kiran
|

Updated on: Jan 05, 2026 | 10:48 AM

Share

మధుమేహంతో బాధపడేవారు ముఖ్యంగా ఆహారాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చపాతీ, అన్నం విషయంలో తరచుగా సందేహాలు వ్యక్తం అవుతాయి. మరి ఈ అంశంపై డాక్టర్ దీప్తి కరేటి ఏమన్నారో ఇప్పుడు చూసేద్దాం.. ఈ రెండు ఆహారాలు కూడా అధిక పోషక నిల్వలు ఉన్నవిగా ఆమె పేర్కొంది. అలాగే రెండింటిని ఎంత మోతాదులో తీసుకుంటే.. ఆరోగ్యానికి అంత మంచిదని చెప్పింది. ఒక కప్పు అన్నంలో సుమారు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే ఒక చపాతీలో దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. చపాతీలో అన్నం కంటే సుమారు 2 గ్రాముల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గోధుమ పిండితో తయారైన చపాతీలో బియ్యం కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒక చపాతీలో దాదాపు 71 కేలరీలు, 3 గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాముల కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బియ్యంలో ఫాస్ఫరస్, మెగ్నీషియం.. గోధుముల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఫోలేట్, ఐరన్ మాత్రం రెండింటిలోనూ దాదాపు సమానంగా లభిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం లేదా చపాతీలలో ఏదైనా తీసుకోవచ్చు. కానీ పరిమితిలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు అన్నం లేదా రెండు చపాతీలు ఒకే కేలరీల స్థాయికి సమానం. డిన్నర్‌లో, చాలామంది డయాబెటిక్ పేషెంట్లు అన్నం తీసుకున్నప్పుడు పరిమితి లేకుండా తినే అవకాశం ఉంది. కానీ చపాతీలను తీసుకోవడం ద్వారా మోతాదును సులభంగా నియంత్రించవచ్చు. రెండు చపాతీలతో డిన్నర్ ముగించడం వారికి మంచిది. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి మిశ్రమ ధాన్యాలతో చేసిన చపాతీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి.. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. శుద్ధి చేయని, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న Wholegrain పిండిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..