Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుధ ఒకరు. దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ.. సినీరంగంలో తనకున్న స్నేహితులు, పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది.

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సుధ. ఎన్నో దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో యాక్టివ్ గా ఉంటూ తనదైన ముద్ర వేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ తన కెరీర్, పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. కొత్త నటీమణులు ఇండస్ట్రీలోకి రావడం వల్ల తన పాత్రలకు ఎటువంటి ఆటంకం కలగడం లేదని అన్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు తనకు ఆఫర్ వచ్చిందని సుధ వెల్లడించారు. కొన్ని కారణాలతో ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
అలాగే హీరో ఉదయ్ కిరణ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “ఉదయ్ కిరణ్ కు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి దూరమయ్యాడు. పెళ్లి జీవితం డిస్ట్రబ్ అయ్యింది. తెలియని ఒంటరితనంలో ఉండిపోయాడు. నేను కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఉదయ్ ను చూసినప్పుడు నాకు దేవుడు ఇచ్చిన బిడ్డ అనుకున్నాను. ఈరోజు ఉదయ్ కిరణ్ ఉండుంటే నా ప్రాపర్టీ మొత్తం ఇచ్చేదాన్ని. నా కొడుకు అయ్యేవాడు. మా ఇద్దరి మెంటాలిటీ ఒకేలా ఉండేది. నేను అతడిని దత్తత తీసుకోవాలనుకున్నాను. కోర్టులో అందుకు సంబంధించిన అన్ని పేపర్స్ సబ్‌మిట్ చేశాం. కోర్టు నుంచి ఆర్డర్ వస్తే దత్తత తీసుకోవచ్చు. కానీ తర్వాత ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. నా కూతురు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
మెల్లగా అందరినీ దూరం పెడుతూ వచ్చాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మేమంతా వద్దని చెప్పాం. తర్వాత పెళ్లి చేసుకునే విషయమే చెప్పలేదు. చనిపోయే ముందు ఎందుకు చావాలి అని అనుకుని ఉండుంటే ఆగిపోయి ఉండేవాడు. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లో కాళ్ల కింద కూర్చుని కాళ్లు పట్టుకుని ఏడ్చాడు. అప్పుడు ధైర్యం చెప్పాం. నన్ను కలవడానికి వచ్చాడు. రావడంతోనే కాళ్లు పట్టుకుని గట్టిగా ఏడ్చాడు. అతడి ఏడుపు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
