Jr NTR: ‘నా వల్లే ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయిందన్నారు..’ మా మధ్య దూరం అందుకే.!
టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ రెడ్డి.. తనకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య ఉన్న స్నేహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య దూరం రావడానికి పెళ్లి, కెరీర్ మార్పులు లాంటివి కారణమని స్పష్టం చేశారు. బాండింగ్ తగ్గినా, స్నేహం చెక్కుచెదరలేదని.. భవిష్యత్తులో మళ్లీ కలుస్తామని వెల్లడించారు.

టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ రెడ్డి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని ఆయన అన్నారు. తమ మధ్య కొంతకాలంగా ఉన్న దూరంపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం, తాను పెళ్లి చేసుకోవడం, ఇద్దరూ తమ తమ కెరీర్‌లలో బిజీ అయిపోవడం, అలాగే సినిమాల ఎంపికలో వచ్చిన మార్పులు లాంటివి తమ మధ్య వచ్చిన గ్యాప్‌కి కారణమని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
గతంలో ఎన్టీఆర్ ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు.. ఆయన కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ను.. శ్రీనివాస్ రెడ్డి, ఇతర స్నేహితులు కాపాడి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పుడు ఎన్టీఆర్ స్నేహితుల్లో ఒకరు ‘నువ్వు అడుగుపెట్టావు, యాక్సిడెంట్ అయింది’ అని సరదాగా అన్నారు. దానికి తాను స్పందిస్తూ ‘నేను ఉన్నాను కాబట్టే ప్రాణాలతో వచ్చాడు. నేను లేకపోతే ఏమయ్యేదో!’ అని బదులిచ్చినట్లు తెలిపింది. ఈ సంఘటన తమ మధ్య ఉన్న బంధానికి మరింత బలాన్ని చేకూర్చింది.
‘శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి విషయాలు అక్కడ.. అక్కడి విషయాలు ఇక్కడ చెప్పడం వల్లే ఎన్టీఆర్‌తో దూరం పెరిగింది’ అనే వదంతుల్లో ఎలాంటి నిజం లేదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను ఎప్పుడూ ఇలాంటి పనులు చేయలేదని.. తన జీవితంలో, కెరీర్‌లో, స్నేహితుల సర్కిల్‌లో కూడా ఇతరుల గురించి చాడీలు చెప్పే అలవాటు లేదని చెప్పారు. ఒకవేళ ఎవరైనా తన గురించి తప్పుగా చెప్పినా, నేరుగా అడిగి క్లియర్ చేసుకుంటానని స్పష్టం చేశారు. తమ మధ్య దూరం రావడానికి అసలు కారణం ఏంటో కూడా తనకు అర్థం కావట్లేదన్నారు. కాగా, పెళ్లి తర్వాత ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం సహజమని, ఇతర స్నేహితులతో కూడా కొంత దూరం పెరిగిందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తమ మధ్య వచ్చిన చిన్న గ్యాప్‌ను త్వరలోనే తొలిగిపోయి.. మళ్లీ కలిసి పని చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు నటుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




