Samantha : సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన సమంత.. మా ఇంటి బంగారం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాప్ కథానాయికగా ఇండస్ట్రీని ఏలేసిన సామ్.. ఇప్పుడు సినిమాలు తగ్గించేసింది. చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సామ్... ఇప్పుడు మెయిన్ లీడ్ రోల్ పోషిస్తూ ఓ సినిమా చేస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో సమంత ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కానీ కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. విడాకులు, మయోసైటిస్ సమస్య కారణంగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇటీవల సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఆమె నిర్మించిన సినిమా శుభం.. ఈ మూవీతోనే సామ్ రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
తాజాగా ఈ సినిమాకు సంబంధించి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈసారి సంక్రాంతి పండక్కి టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ షేర్ చేసింది చిత్రయూనిట్. “మీరు చూస్తా ఉండండి. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది.” అంటూ రాసుకోచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన సామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. దీంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతూ.. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బేబీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మిస్తుండగా.. దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
