AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే విపరీతమైన ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. కానీ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో అన్షు అంబానీ ఒకరు. చాలా కాలం తర్వాత ఇటీవల మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
Anshu Ambani
Rajitha Chanti
|

Updated on: Jan 07, 2026 | 12:06 PM

Share

తెలుగు సినీరంగంలో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో అన్షు అంబానీ ఒకరు. తొలి చిత్రంతోనే చూడచక్కని రూపం, సహజమైన నటనతో కట్టిపడేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమోగింది. అన్షు అంబానీ.. తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ మన్మథుడు. ఇందులో అన్షు అంబానీ, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అన్షు.. ఫస్ట్ సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. అందులో ఆమె యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు అడియన్స్ . ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలోనూ కనిపించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..

కానీ ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది అన్షు. కెరీర్ మంచి ఫాంలో ఉంటుందనుకున్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండిపోయిన ఆమె.. ఇటీవల సందీప్ కిషన్ నటించిన మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో రావు రమేశ్ కు జోడిగా కనిపించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మజాకా సినిమా తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్షు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇటీవల బ్లౌజ్ లేకుండా చీరకట్టులో ఫోటోషూట్ చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

ఇక ఇప్పుడు తన కూతురిని అభిమానులకు పరిచయం చేసి ఒక్కసారిగా షాకిచ్చింది. తన కూతురు షనయా తొలిసారిగా సినిమా షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిందట. ఈ విషయాన్ని చెబుతూ.. “నా కూతురు షనయా మొదటిసారి సెట్ లోకి అడుగుపెట్టింది. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నాపై చూపించిన ప్రేమ, అభిమానం నా కూతురిపై కూడా చూపించండి’ అంటూ కూతురితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అన్షుకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ అవాక్కవుతున్నారు. షనయా తన తల్లిలాగే ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

లాంచ్‌కు రెడీ అయిన ఒప్పో రెనో సిరీస్‌ ఫోన్‌! ధర ఎంతంటే..?
లాంచ్‌కు రెడీ అయిన ఒప్పో రెనో సిరీస్‌ ఫోన్‌! ధర ఎంతంటే..?
ఆర్టీసీ బస్సులు బంద్..! సంక్రాంతి వేళ ప్రయాణికులకు షాక్
ఆర్టీసీ బస్సులు బంద్..! సంక్రాంతి వేళ ప్రయాణికులకు షాక్
ముంచుకొస్తున్న వాయుగుండం.! తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం.
ముంచుకొస్తున్న వాయుగుండం.! తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం.
స్టార్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్.. రెండు సినిమాలపై భారీ ఆశలు
స్టార్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్.. రెండు సినిమాలపై భారీ ఆశలు
ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
మీర్జాగూడ వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఎంతమంది చనిపోయారంటే?
మీర్జాగూడ వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఎంతమంది చనిపోయారంటే?
తొలుత బ్యాట్‌తో బీభత్సం.. ఆ తర్వాత 'పుష్ప' సెలబ్రేషన్స్
తొలుత బ్యాట్‌తో బీభత్సం.. ఆ తర్వాత 'పుష్ప' సెలబ్రేషన్స్
గ్రాట్యూటీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
గ్రాట్యూటీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
యూరప్‌లోనే అతిపెద్ద థియేటర్‌లో చరిత్ర సృష్టిస్తున్న తెలుగు సినిమా
యూరప్‌లోనే అతిపెద్ద థియేటర్‌లో చరిత్ర సృష్టిస్తున్న తెలుగు సినిమా
దేశంలో ఇక రెండే బ్యాంకులు.. మరో భారీ విలీనం దిశగా కేంద్రం
దేశంలో ఇక రెండే బ్యాంకులు.. మరో భారీ విలీనం దిశగా కేంద్రం