ibomma Ravi : ఐబొమ్మ రవికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు కొట్టివేత..
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. అతడికి బెయిల్ ఇస్తే దేశం దాటిపోతాడని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. పోలీసుల వాదనలను విన్న కోర్టు రవికి చెందిన 5 బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అలాగే 12 రోజుల కస్టడీలో రవి చెప్పిన వివరాలు ఇప్పటికే కోర్టుకు సమర్పించారు పోలీసులు.

పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మంది రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అతడికి సంబంధించిన 5 బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని.. ఒకవేళ బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
ఇమంది రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన స్నేహితుడు ప్రహ్లాద్ తోపాటు మరో ఇద్దరి పేర్లతోరవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్ తోపాటు అంజయ్య, కాళీ ప్రసాద్ పేర్లు, వివరాలు ఉపయోగించి నకిలీ కార్డులు సంపాదించడాని పోలీసుల విచారణలో తేలింది. వీటిని ఉపయోగించి తన ఫోటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు.
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
ప్రహ్లాద్ అనే వ్యక్తి రవితో కలిసి 2017లో అమీర్ పేట్ లోని హాస్టల్ రూమ్ లో ఉన్నాడు. ఆ సమయంలో అతడికి సంబంధించిన పదవ తరగతి మార్కుల లిస్ట్, ఆధార్ కార్డుల కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని ఉపయోగించి అతడి పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు. వీటితోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తన పదవ తరగతి క్లాస్ మేట్స్ పేర్ల ఆధారంగానూ నకిలీ గుర్తింపు కార్డులు తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
