Deepika Padukone : స్టార్ హీరోలకు ధీటుగా.. దీపికా పదుకొణె బాడీగార్డ్ జీతం తెలిస్తే.. హార్ట్ ఎటాకే..
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో హిందీ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు షారుఖ్ సరసన కింగ్ చిత్రంలో నటిస్తుంది. అటు కూతురు ఆలనపాలన చూసుకుంటూనే.. ఇటు కెరీర్ పై దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతుంది.

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే జనవరి 5న 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ చెప్పారు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.500 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్స్, బిజినెస్ రంగాల్లోనూ ఈ బ్యూటీ భారీగానే సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే దీపికాకు ఆమె బాడీగార్డ్ జలాలుద్దీన్ షేక్ బర్త్ డే విషెస్ చెప్పారు. అతడు చేసిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫోటోలో దీపిక చిక్ మినీ డ్రెస్‌లో ప్రకాశవంతంగా కనిపిస్తూ, స్వేచ్ఛగా నవ్వుతూ ఉండగా, జలాలుద్దీన్ ఆమె పక్కన గర్వంగా చిరునవ్వుతో నిలబడి ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
“మీకు చాలా సంతోషకరమైన రోజులు రావాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించాలి” అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఇప్పుడు జలాలుద్దీన్ షేక్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అతడి జీతం ఎంత ఉంటుందనే విషయంపై ఇప్పుడు నెట్టింట ఆరా తీస్తున్నారు. నివేదికల ప్రకారం 2024–2025 నాటికి జలాలుద్దీన్ సంవత్సరానికి దాదాపు రూ. 1.2 కోట్లు జీతం తీసుకున్నాడట. అంతకు ముందు అతడు ఏడాదికి రూ.80 లక్షలు మాత్రమే తీసుకోగా.. గత రెండేళ్లుగా అతడి వార్షిక జీతం పెరుగుతూ వచ్చింది. అతడు చాలా కాలంగా దీపికా బాడీగార్డ్ గా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
అంతకు ముందు 2018లో రణవీర్, దీపికా వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో వార్తలలో నిలిచాడు. అలాగే అతడికి దీపికా రాఖీ కట్టడం కూడా అప్పట్లో వార్తలలో నిలిచింది. ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం దీపికా యాక్షన్ కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తూన్న కింగ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సుహానా ఖాన్ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోయే చిత్రంలో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
