Telangana: డాక్టర్ లావణ్య కేసులో అసలు ట్విస్ట్.. ఆమె ఇలా చేసింది అందుకే.. షాకింగ్ నిజాలు.!
డాక్టర్ లావణ్య మృతికి కారణాలేంటి? ప్రేమ.. నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగించిందా? కులం పేరుతో ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె మనస్తాపానికి గురైందా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ఎస్.. ప్రేమికుడుకి కులం అడ్డొచ్చింది.. కులం ముందు ప్రేమ చిన్నబోయింది. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది.

సిద్దిపేట మెడికల్ కాలేజీ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. లావణ్య ఆత్మహత్యకు దారితీసిన కారణాలను ప్రకటించారు. లావణ్యను ప్రణయ్ తేజ్ ప్రేమించి మోసం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసుల తెలిపారు. పెళ్లికి ప్రణయ్ నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రణయ్ తేజ్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రణయ్, లావణ్య ఈ ఇద్దరు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగిన ప్రణయ్.. కులం పేరుతో నిరాకరించడంతో ఇంజిక్షన్ ద్వారా పాయిజన్ తీసుకుంది లావణ్య. నెల రోజుల క్రితం కూడా లావణ్య ఆత్మహత్యాయత్నం చేయడంతో స్నేహితులు అడ్డుకున్నారు. తన బాధను అక్కకు చెప్పుకోవడంతో ఈ మధ్యే ఇంటికి తీసుకెళ్లి ధైర్యం చెప్పింది. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటానని సిద్దిపేట వెళ్లి.. శాశ్వతంగా దూరమైందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కుటుంబసభ్యులు.
పాయిజన్ తీసుకున్న తర్వాత లావణ్యకు ముందు సిద్దిపేట మెడికల్ కాలేజీలో వైద్యం అందించారు. అనంతరం నిమ్స్‌కు తరలించారు. వైద్యులు చేసిన ప్రయత్నమేమి ఫలించలేదు. చివరకు ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. జోగిలాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన లావణ్య ప్రభుత్వ స్కూల్, కాలేజీలోనే చదువుకున్నా చదువులో ముందుండేంది. ప్రస్తుతం హౌస్ సర్జన్‌గా పనిచేస్తోంది. ప్రణయ్‌తో ప్రేమ విషయంలో వివాదాలు రావడంతో ఈ మధ్య ఇంటికి వచ్చి వెళ్లింది. అత్యంత పేద కుటుంబం.. అమ్మ, నాన్నలు కూలీ పనిచేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ఎన్నో ఆశలతో బిడ్డను గొప్పగా చదివిస్తే.. తమకు ఇలా కడుపుకోత మిగిల్చిందని లావణ్య తండ్రి కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




