Chicken: చికెన్, మటన్ లేదా ఫిష్ ఏది మంచిది.? ఇలా తింటే లివర్ ఇక షెడ్డుకే.!
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రెడ్ మీట్, వైట్ మీట్ రెండూ కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె జబ్బులకు కారణమవుతాయి. రెండింటి ప్రభావం ఒకేలా ఉంటుంది. మటన్‌లో కొవ్వు ఎక్కువ, చికెన్, చేపల్లో ప్రోటీన్ పుష్కలం. అధిక కొవ్వు మాంసాలు బరువు పెంచుతాయి, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని తెలిపింది.

ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్, ఫిష్ లాంటి అనేక రకాల నాన్-వెజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని రెడ్ మీట్, వైట్ మీట్‌గా విభజించారు. రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్, పోర్క్ ఈ లిస్టులో ఉంటాయి. వైట్ మీట్ అంటే చేపలు, కోడి మాంసం, రొయ్యలు, పీతలు, పక్షుల మాంసం ఉంటాయి. చికెన్‌లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మటన్‌లో ప్రోటీన్‌తో పాటు కొవ్వు పదార్థాలు(ఫ్యాట్స్) కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు మటన్‌కు బదులు చికెన్‌ను తింటుంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివి కావని భావించేవారు చేపలు, రొయ్యలను ఇష్టపడతారు.
ఈ మాంసాహారాలలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది? అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సంస్థ ఇటీవల ఒక కీలక పరిశోధనను నిర్వహించింది. రెడ్ మీట్, వైట్ మీట్ రెండూ కార్డియో వాస్కులర్ జబ్బులకు కారణమవుతాయి. అవి కొలెస్ట్రాల్‌పై దాదాపు ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అంటే, రెడ్ మీట్ ఎంత ప్రమాదకరమో, వైట్ మీట్ కూడా కొలెస్ట్రాల్ విషయంలో అంతే ప్రభావాన్ని చూపుతుంది. ఇది నాన్-వెజ్ ప్రియులకు ముఖ్యమైన గమనిక.
కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా.. ఎద్దు, గొర్రె లాంటి జంతువుల మాంసాలలో కార్నిటైన్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. ఈ కార్నిటైన్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుందని, తద్వారా గుండె దెబ్బతినే ప్రమాదం ఉందని అధ్యయనం వెల్లడించింది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. మనం తినే ఏ మాంసాహారంలోనైనా ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే, మటన్‌లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. చికెన్, చేపలు, రొయ్యల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను అతిగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్(LDL), ట్రై గ్లిజరైడ్స్(Triglycerides) స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల అధికంగా బరువు పెరగడం, అలాగే హార్ట్ ఎటాక్ రావడం లాంటివి వస్తాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను తక్కువగా తినాలి. నిత్యం ఏ మాంసాహారం తీసుకున్నా సరే, అందులో కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. చికెన్, చేపలు లాంటి వైట్ మీట్‌లో ప్రోటీన్లను పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినవచ్చు, కాకపోతే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




