AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డును పర్‌ఫెక్ట్‌గా ఉడకబెట్టేందుకు సరైన పద్ధతి.. ఇలా చేస్తే సూపర్‌ టేస్ట్‌, బంపర్‌ బెనిఫిట్స్..!

మీరు ఉడికించిన గుడ్లను ఇష్టంగా తింటున్నారా..? బాయిల్డ్‌ ఎగ్స్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్డు సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. పైగా గుడ్డు ఉడికించడం కూడా చాలా తేలిక. పైగా వంట పని చాలా స్పీడ్‌గా పూర్తవుతుంది. కానీ, అసలు విషయం ఏంటంటే.. చాలా మంది గుడ్లను సరిగ్గా ఉడకబెట్టలేరు. కొందరు వాటిని ఎక్కువగా ఉడికిస్తే, మరికొందరు తక్కువగా ఉడికిస్తారు. కానీ, గుడ్డు ఉడకబెట్టడానికి సరైన మార్ ఏంటో తప్పక తెలుసుకోవాలి.. లేదంటే నష్టం మీకే..

గుడ్డును పర్‌ఫెక్ట్‌గా ఉడకబెట్టేందుకు సరైన పద్ధతి.. ఇలా చేస్తే సూపర్‌ టేస్ట్‌, బంపర్‌ బెనిఫిట్స్..!
Boil Eggs
Jyothi Gadda
|

Updated on: Jan 06, 2026 | 10:34 AM

Share

గుడ్డును ఉడకబెట్టడం చాలా సులభం అనిపించవచ్చు. కానీ, సరైన పద్ధతిలో ఉడికించడం అంత సులభం కాదు. గుడ్డును ఉడికించినప్పుడు చాలా సార్లు అవి పగిలిపోతుంటాయి. లోపలి పచ్చసొన బయటకు వచ్చేస్తుంది. గిన్నెలో చిన్న ముక్కలుగా మారుతుంది. గుడ్డులోని తెల్లసొన జిగటగా ఉంటుంది. పచ్చసొన, గుడ్డులోని తెల్లసొన వేర్వేరు ఉష్ణోగ్రతలలో ఉడికిపోతాయి. దీని వలన గుడ్డును సరిగ్గా ఉడికించడం కష్టమవుతుంది. కానీ, కొత్త పరిశోధన మీ సమస్యకు పరిష్కారం చెబుతోంది. గుడ్లను ఉడకబెట్టడానికి ఒక సులవైన పద్ధతిని వెల్లడించింది.

గుడ్డు ఉడకబెట్టడం ఎందుకు కష్టం?:

ఒక గుడ్డులో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి పచ్చసొన, రెండోది తెల్లసొన. పచ్చసొన దాదాపు 65°C వద్ద ఉడుకుతుంది. అయితే తెల్లసొనకు దాదాపు 85°C ఉష్ణోగ్రత అవసరం. సాధారణంగా గుడ్డును 100°C వద్ద ఉడకబెట్టినప్పుడు తెల్లసొన పూర్తిగా ఉడికిపోతుంది. కానీ, పచ్చసొన గట్టిపడుతుంది. అయితే, తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించినట్లయితే పచ్చసొన మృదువుగా ఉంటుంది. తెల్లసొన తక్కువగా ఉడకుతుంది.

ఇవి కూడా చదవండి

గుడ్లు ఉడకబెట్టడానికి శాస్త్రీయ పద్ధతి:

ఇటలీ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ శాస్త్రవేత్త పెల్లెగ్రినో ముస్టో నేతృత్వంలోని పరిశోధనా బృందం ఆవర్తన వంట అనే కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది. ఈ పద్ధతిలో ముందుగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరుగుతున్న నీటిలో గుడ్డును ఉడికించారు. ఆ తర్వాత 30 డిగ్రీల టెంపరేచర్ ఉన్న నీటిలో ఉడికించాలి. ఇలా ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి గుడ్డుని మరుగుతున్న నీటి నుంచి గోరువెచ్చని నీటిలోకి, మళ్లీ గోరువెచ్చని నీటి నుంచి మరుగుతున్న నీటిలోకి మారుస్తూ ఉడికించారు. ఇక్కడ పచ్చసొన ఉష్ణోగ్రతను దాదాపు 67 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంచుతుంది. అయితే తెలుపు రంగు వివిధ ఉష్ణోగ్రతలకు లోనవుతుంది. ఇలా కనీసం 32 నిమిషాల పాటు చేసిన తర్వాత క్రీమీ, మృదువైన పచ్చసొన వస్తుంది. తెలుపు చాలా గట్టిగా లేదా జిగటగా లేకుండా గుడ్డు పర్‌ఫెక్ట్‌గా ఉడికిందని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ, ఇది ఇంట్లో వంట చేసేవారికి అంత సులభం కాకపోవచ్చునని కూడా అంటున్నారు. కానీ, ఈ పద్ధతిలో గుడ్డు ఉడకబెట్టడం వల్ల అద్భతమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు.

దాని వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?:

ఈ పద్ధతి దాని రుచికి మాత్రమే కాకుండా దాని ఆరోగ్య ప్రయోజనాలను కూడా పెంచుతుందని చెబుతున్నారు. ఈ విధంగా ఉడికించిన గుడ్లలో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న సూక్ష్మపోషకాలు. ఒక అధ్యయనం ప్రకారం, అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉన్న ఆహారంలో గుండె జబ్బులు, క్యాన్సర్, న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..