52ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల భామలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ, ఐదు పదుల వయసు దాటినా కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న ఆ గ్లామర్ బ్యూటీని చూస్తే ఎవరైనా అసూయ పడాల్సిందే. ఆమె నడక, ఆమె ఫిజిక్, ఆమె చర్మ సౌందర్యం.. ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటుంది.

సాధారణంగా హీరోయిన్లు తమ బాడీని షేప్ లో ఉంచుకోవడానికి కఠినమైన వర్కౌట్లు చేస్తారని మనకు తెలుసు. కానీ ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్ మాత్రం తన యవ్వనానికి అసలైన కారణం యోగా అని, అందులోనూ శ్వాసపై నియంత్రణ సాధించే కొన్ని ప్రత్యేక పద్ధతులని గట్టిగా నమ్ముతుంది. మనం నిత్యం చేసే శ్వాస క్రియలోనే మన ఆరోగ్యం, అందం దాగి ఉన్నాయని ఆమె నిరూపిస్తోంది. ఆ స్టార్ సెలబ్రిటీ మరెవరో కాదు.. మలైకా అరోరా. ఆమెను నిత్య యవ్వనిగా ఉంచుతున్న ఆ 5 రకాల ప్రాణాయామ పద్ధతులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Malaika Arora
1. అనులోమ విలోమ (Alternate nostril breathing)
మలైకా తన రోజును ఈ ప్రాణాయామంతోనే ప్రారంభిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను శుద్ధి చేయడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒక ముక్కు రంధ్రంతో గాలి పీల్చి మరో రంధ్రం ద్వారా వదలడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, ముఖంలో సహజమైన మెరుపు రావడానికి తోడ్పడుతుంది.
2. కపాలభాతి (Skull-shining breath)
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, పొట్ట భాగంలో ఉన్న కొవ్వును కరిగించడానికి మలైకా ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తుంది. వేగంగా శ్వాసను బయటకు వదలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా, బాడీని టోన్డ్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
3. భ్రమరి ప్రాణాయామం (Bee breath)
మలైకా అరోరా తన ఫిట్‌నెస్ జర్నీలో మానసిక ప్రశాంతతకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గాలిని వదిలేటప్పుడు తుమ్మెద లాగా శబ్దం చేసే ఈ ప్రక్రియ మెదడును ప్రశాంతపరుస్తుంది. ఇది ఆందోళనను తగ్గించి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. దీనివల్ల వయసు పెరిగినా ఆ ప్రభావం ముఖంపై కనిపించదు.
4. భస్త్రిక (Bellows Breath)
శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఈ ప్రాణాయామం సహాయపడుతుంది. లోతుగా గాలి పీల్చుకోవడం వల్ల శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది. ఇది మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి కూడా మలైకా దీనిని సిఫార్సు చేస్తుంది.
5. ఉజ్జాయి ప్రాణాయామం (Om chanting)
చివరిగా మలైకా తన యోగా సెషన్‌ను ‘ఓం’ కార నాదంతో ముగిస్తారు. లోతుగా గాలి పీల్చి ఓం అని ఉచ్చరించడం వల్ల కలిగే ప్రకంపనలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఇది శ్వాసపై నియంత్రణను పెంచి, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.
View this post on Instagram
అందం అంటే కేవలం పైన పూసుకునే క్రీముల్లో లేదు, మనం లోపలి నుంచి ఎంత ఆరోగ్యంగా ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుందని మలైకా నిరూపించింది. జిమ్ లో గంటల తరబడి గడిపే సమయం లేకపోయినా, ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని ఈ 5 ప్రాణాయామాలు చేస్తే అద్భుతమైన మార్పులు గమనించవచ్చు.
