ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఈ సారి విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఉచితంగా ల్యాప్‌టాప్‌లు..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార డీఎంకే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీని తిరిగి ప్రారంభించింది. ఇది 'ఎన్నికల తాయిలం' అంటూ ప్రతిపక్ష అన్నా డీఎంకే విమర్శిస్తోంది. అయితే, ఈ పథకాన్ని గతంలో జయలలిత ప్రారంభించారని డీఎంకే కౌంటర్ ఇచ్చింది. ఉచిత పథకాలకు పెట్టింది పేరైన తమిళనాడులో, ఈ ల్యాప్‌టాప్ పంపిణీ మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది.

తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా రసవత్తరంగా మారుతున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో ప్రతిపక్షాలు ఉంటే.. ఓటర్లు చేజారి పోకుండా అధికార డిఎంకె వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది.. తాజాగా విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ మొదలు పెట్టింది డీఎంకే.. ఇదంతా ఎన్నికల తాయిలాలు అంటూ విమర్శలకు దిగింది ప్రతిపక్ష అన్నా డీఎంకే.. ప్రతిపక్షానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది డీఎంకే.. ఇంతకీ ల్యాప్ టాప్ ల పంపిణీ అంశం వేదికగా తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు తెలియాలంటే పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే…
దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత పథకాలకు పుట్టినిల్లు తమిళనాడుగా చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు.. ఆ మాటకొస్తే భారతదేశంలోనే ముందుగా ఉచిత పథకాలు పురుడు పోసుకుంది ఇక్కడే అని చెప్పొచ్చు.. ఉచిత కలర్ టీవీలు, ఉచిత, మిక్సీలు గ్రైండర్లు, ఫ్యాన్లు, విద్యార్థులకు లాప్టాప్ లు. అమ్మ క్యాంటీన్ల పేరుతో తక్కువ ధరలకు భోజనం.. వృద్ధాప్య పెన్షన్లు.. ఉచిత బస్సు పథకాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది.. ఇవన్నీ ముందుగా మొదలైంది తమిళనాడు లోనే..
ప్రశాంతంగా అక్కడ ప్రజలను పాలించిన ప్రస్తుత అధికారంలో ఉన్న డిఎంకె ప్రతిపక్ష అన్నా డిఎంకె.. ఈ రెండు పార్టీలు పోటీలు పడి ప్రతి ఎన్నికల్లో ఉచిత పథకాలను మ్యానిఫెస్టోలో ఉంచి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేశాయి.. అలా జయలలిత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో విద్యార్థులకు లాప్టాప్ ల పంపిణీ.. 2011లో అధికారంలోకి వచ్చాక దివంగత జయలలిత ఉచిత లాప్టాప్ లో పథకాన్ని ప్రారంభించారు.. తిరిగి 2016లో కూడా సీఎం గా జయలలిత ఎన్నికయ్యారు.. ఆ తర్వాత కొద్దిరోజులకి అనారోగ్యంతో చనిపోయారు.. ఇంకా కొద్దిరోజులకు ఆ పథకం ఆటకెక్కింది..
2021 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన డిఎంకె జయలలిత మొదలుపెట్టిన చాలా పథకాలను కొనసాగిస్తామని ప్రకటించింది.. అందులో భాగంగా గతంలో జయలలిత మొదలుపెట్టిన ల్యాప్టాప్ ల పంపిణీ కూడా కొనసాగిస్తూ వస్తోంది.. తాజాగా ఏడాది 20 లక్షల మందికి విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీకి ఏర్పాటు పూర్తి చేసింది.. ఇవాళ చెన్నైలో సీఎం స్టాలిన్ చేతుల మీదుగా కార్యక్రమం మొదలైంది.. తొలి విడతగా 10 లక్షల మందికి.. ఫిబ్రవరి నెలాఖారీకి మొత్తం 20 లక్షల మందికి లాప్టాప్ల పంపిణీ చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది..
అయితే లాప్టాప్ ల పంపిణీ కార్యక్రమానికి అన్నా డీఎంకే అభ్యంతరం చెప్పింది.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు డిఎంకె ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేపడుతోందని వెంటనే కార్యక్రమాన్ని ఆపేయాలని డిమాండ్ చేసింది.. అన్న డీఎంకే పంపించడానికి డిఎంకె గట్టి కౌంటర్ ఇచ్చింది.. ఈ కార్యక్రమం మొదలుపెట్టింది జయలలిత సీఎంగా ఉన్నప్పుడు మీ పార్టీ నే కదా.. మీరే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏంటి అంటూ తిరిగి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం ఉదయినిది స్టాలిన్.. అధికార ప్రతిపక్ష మాటలు ఎలా ఉన్నా ఇవాల్టి నుంచి తమిళనాడులో లాప్టాప్ ల పంపిణీ మొదలైంది.. దీని పై ఇంకా ఎలాంటి పొలిటికల్ రచ్చ జరుగుతుందో చూడాలి మరి..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




