Business Tips: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
స్టాక్ మార్కెట్ అంటేనే చాలామంది భయపడతారు. కానీ కచ్చితంగా మీరు ఈ 8 ముఖ్యమైన నియమాలు పాటిస్తే.. నష్టాలను దాటుకుని.. తెలివైన పెట్టుబడులతో దీర్ఘకాలిక రాబడులు సంపాదించవచ్చు. డేటా తెలుసుకోవాలి, ఓపిక ఉండాలి.. అప్పుడే మీరు కోటీశ్వరులు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ప్రతీది మనం మనసు పెట్టి నేర్చుకున్నామంటే.. మనకు రానిదంటూ ఏమి ఉండదు. క్యాండిల్స్, అంకెలు, డేటా.. ఇలా స్టాక్ మార్కెట్‌ను దెబ్బకు దడుసుకుంటారు చాలామంది. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి.. విజయవంతంగా రాబడులు సంపాదించాలంటే.. కచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాల్సిందే. మరి ముఖ్యంగా పాటించాల్సిన 8 నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ రూల్స్ పాటిస్తూ.. పెట్టుబడిదారులు తెలివైన నిర్ణయాలు తీసుకుని, తమ సంపదను పెంచుకోవచ్చు. మొదటిగా, మార్కెట్ ఎప్పుడూ మీ అంచనాలు లేదా భావోద్వేగాల ప్రకారం నడవదు. భావోద్వేగాలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటే తరచుగా నష్టాలను చూడాల్సి వస్తుంది. రెండోది కేవలం డేటాను చదవడం కాదు.. దానిని అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. సంఖ్యల వెనుక ఉన్న అంతర్యాన్ని తెలుసుకుని.. తద్వారా సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. మూడోది, స్టాక్ మార్కెట్‌లో ఓపిక చాలా అవసరం. తక్షణ లాభాలు ఆశించకుండా, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టినవారే విజయం సాధిస్తారు.
నాలుగో రూల్.. ఒకే స్టాక్‌పై ఆధారపడటం పెద్ద రిస్క్. నష్టాలను తగ్గించడానికి, మీ పెట్టుబడులను వివిధ స్టాక్‌లు లేదా రంగాలలో విస్తరించడం(diversification) తప్పనిసరి. ఐదోది మార్కెట్‌లో శ్రద్ధతో పాటు క్రమశిక్షణ(discipline) మరింత కీలకం. నిర్దిష్టంగా రూల్స్ ఏర్పాటు చేసుకుని.. వాటిని పకడ్బందీగా పాటించాలి. ఎక్కువగా ట్రేడింగ్ చేస్తే.. ఎల్లప్పుడూ లాభాలను ఇవ్వదు. అనవసరమైన లావాదేవీలు.. ఖర్చులు, రిస్క్‌ను పెంచుతాయి. ఏడోది.. స్టాక్ మార్కెట్‌లో నష్టాలు ఒక నేర్చుకునే పాఠం లాంటిది. ప్రతి నష్టం నుంచి పాఠాలు నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి నిర్ణయాలకు దారి తీస్తుంది. చివరిగా, ఆర్థిక నిర్ణయాల నుంచి భావోద్వేగాలను దూరంగా ఉంచడం అత్యవసరం. భయం, అత్యాశ లాంటివి తెలివైన పెట్టుబడిదారుడిని తప్పుదారి పట్టిస్తాయి.
గమనిక: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నష్టాలకు టీవీ9 బాధ్యత వహించదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




