Petrol Prices: బిగ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? త్వరలోనే కొత్త ధరలు
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్‌కు డిమాండ్ పడిపోతుంది. ముడి చమురు నిల్వలు ఎక్కువగా ఉండటం, ఉత్పత్తి పెరుగుతుండటంతో వాటి ధరలు తగ్గుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే సామాన్యులకు పండగే..

పెట్రోల్, డీజిల్ ధరలపై అనేక వస్తువుల ధరలు ఆధారపడి ఉంటాయి. వీటి ధరలు తగ్గితే రవాణా ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల ప్రభావం అన్నీ వస్తువులపై ఉంటుంది. దీంతో చమురు ధరలు తగ్గితే అనేక వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్రజలపై ధరల భారం కూడా తగ్గుతుంది. అమెరికా-వెనిజులా ఉద్రిక్తతల క్రమంలో చమురు ధరల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. వెనిజులా క్రూడ్ ఆయిల్‌ను ఉత్పత్తిలో ప్రసిద్ది పొందింది. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న క్రమంలో.. ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా ఆయిల్ కంపెనీల్లో అమెరికా భారీగా పెట్టుబడులు పెట్టనుందని ప్రకటించారు. ప్రస్తుతం వెనిజులా రోజుకు 10 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తుండగా.. భవిష్యత్తులో 30 లక్షల బ్యారెల్స్‌కు పెరిగే అవకాశముంది. దీంతో పెట్రోల్, డీజిల్ గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?
ఈ క్రమంలో ఓ వార్త బలంగా వినిపిస్తోంది. 2026లో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటమే కాకుండా డిమాండ్ తగ్గడమే అని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్‌కు అంతగా డిమాండ్ లేదు. దీంతో వీటి ధరలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 60 డాలర్లుగా ఉంది. రాబోయే రోజుల్లో ఇది 53.51 డాలర్లకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2026 చివరి నాటికి 14 శాతం తగ్గుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ తగ్గుతున్న క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఈ ఏడాది తగ్గుతాయని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.
ఎస్బీఐ కీలక రిపోర్ట్
పెట్రోల్, డీజిల్ ధరలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రిపోర్ట్ వెలువరించింది. 2026లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టనున్నాయని, దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అకాశముందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు నిల్వలు భారీగా ఉన్నాయని, దీని వల్ల డిమాండ్ తగ్గుతుందని పేర్కొంది. రానున్న రోజుల్లో బ్రెంట్ క్రూడ్ ధర 50 డాలర్లకు కూడా పడిపోవచ్చని స్పష్టం చేసింది. అటు యూఎస్ ఇందన సమాచార సంస్ధ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. 2026 తొలి త్రైమాసికంలో క్రూడ్ ఆయిల్ ధర 55 డాలర్లకు తగ్గొచ్చని తెలిపింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలను బట్టి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పవచ్చు.
