AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిడిల్ క్లాస్ ‘గ్యాస్’ టెన్షన్..! ఇది ఇంకోరకం లాక్‌డౌన్.. యుద్ధం ముగిసే వరకు ముసుగేయాల్సిందేనా..?

గ్యాస్ షార్టేజ్ సంగతేమోగానీ.. అన్ని సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయంతో తెగ కొనేస్తున్నారు జనం. నూనెలు, పప్పులు, ఇతర పచారీ సామానును ముందస్తుగా కొని నిల్వ చేసుకుంటున్నారు. ఈ భయం కారణంగా.. ధరలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి దేశంలో ఆహారం, ఎరువులు, ఇంధన నిల్వలు అన్నీ పుష్కలంగానే ఉన్నాయంటోంంది కేంద్రం. కాని, ఆ స్టేట్‌మెంట్‌ను చెవికెక్కించుకునే వాళ్లెవరు?

మిడిల్ క్లాస్ 'గ్యాస్' టెన్షన్..! ఇది ఇంకోరకం లాక్‌డౌన్.. యుద్ధం ముగిసే వరకు ముసుగేయాల్సిందేనా..?
Lpg
Shaik Madar Saheb
|

Updated on: Mar 10, 2026 | 9:49 PM

Share

‘ఫుడ్ ఇండస్ట్రీకి గ్యాస్ బంద్.. హోటళ్ల మూసివేత’. ఇదేం చిన్న న్యూస్ కాదు. ఒక రెస్టారెంట్ బంద్ అయితే.. కిలోల కొద్దీ కూరగాయలు, లీటర్ల కొద్దీ పాలు, చికెన్, మటన్, ఎగ్స్, నూనె, నెయ్యి, సరుకులు.. అన్ని ఆర్డర్స్ ఆగిపోతాయ్. దేశవ్యాప్తంగా లక్షల హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మూసుకుపోతే? రాబోయేది ఆర్థిక ఉపద్రవమే. రైతుల నుంచి ఆక్వా, పౌల్ట్రీ, డెయిరీ దాకా అందరిపైనా ఎఫెక్ట్ ఉంటుంది. ఇదెంత భయంకరమైన సిచ్యుయేషన్‌గా మారబోతోందో తెలుసా. సపోజ్.. హోటల్‌లో స్టే చేస్తారు. ‘సారీ సార్.. ఫుడ్ ఇవ్వలేం’ అంటే? ఫారెనర్లు, టూరిస్టులు.. అసలు పర్యాటకరంగంపైనే పెద్ద దెబ్బ కదా..! హోటల్స్ మూసుకుపోతే.. ఫుడ్ డెలివరీ బాయ్స్, జీతం కాక టిప్‌పై ఆధారపడే వెయిటర్లు, సర్వీస్ స్టాఫ్.. వీళ్లందరికీ ‘నో వర్క్ నో పే’ అనే పరిస్థితి రాబోతోంది. దేశం గురించి తరువాత.. ముందు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూద్దాం. చాలా సీరియస్ సిచ్యుయేషన్ రాబోతోంది. హైదరాబాద్‌లోని పేయింగ్ గెస్ట్, హాస్టళ్లపై గ్యాస్ కొరత ప్రభావం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర హోటళ్లపై ‘గ్యాస్’ ఎఫెక్ట్ ఉండబోతోంది. మనిషికి ఆక్సిజన్ ఎలాగో… హోటల్స్‌కి గ్యాస్ అలాగ. ఊపిరి ఒక్క హైదరాబాద్‌లోనే 74 వేల రెస్టారెంట్లకు కష్టాలు తప్పేలా లేవు. బిజీ లైఫ్‌లో ఇంట్లో వండుకోవడం మానేసి, పూటపూటా స్విగ్గీ, జొమాటోల మీద ఆధారపడుతున్న లక్షలాది మందికి ఇది నిజంగా పిడుగులాంటి వార్తే. హోటల్స్ మూతపడితే యాప్స్ నమ్ముకున్నోళ్లకు ఆకలి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి