నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వైఫల్యానికి ప్రతిపక్షాలే కారణమన్న పవన్ వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ ఖండించారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవం, హక్కులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తూ, మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపాలని ట్వీట్ చేశారు.