AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Trains: హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 8 రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు..

భారతీయ రైల్వే తెలంగాణకు 8 కొత్త వీక్లీ రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్ (తిరుపతి, తిరుచానూరు), ఒడిశా (భువనేశ్వర్), రాజస్థాన్ (శ్రీ గంగానగర్, జైపూర్)లకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.. భక్తులకు, సుదూర ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మే, జూలై 2026 నుంచి ఈ రైళ్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

New Trains: హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 8 రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు..
Summer Special Trains
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Apr 21, 2026 | 8:10 PM

Share

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్తరైళ్లను ప్రకటించింది. ఈ కొత్త రైళ్లు వీక్లీ ట్రైన్స్‌గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌లోని కాచిగూడ, చర్లపల్లి, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల నుంచి మూడు రాష్ట్రాలకు కొత్త రైళ్లను నడపాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటుగా భువనేశ్వర్, జైపూర్, శ్రీగంగానగర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది.

కొత్త సర్వీసులు బయలుదేరే సమయం, వారం, గమ్యస్థానం ఇలా:

17607/17608 నెంబరుతో కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30కు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 15 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.

17601/17602 నెంబరుతో కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 జూలై, 2026 నుంచి ప్రారంభం కానుంది.

17047/17048 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 7 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.

17441/17442 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.

17443/17444 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ 15మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.

17059/17060 నెంబరుతో ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ 11 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.

17067/17068 నెంబరుతో ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. 5 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.

17079/17080 నెంబరుతో ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రకటించనుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం కోసం కొత్త ట్రైన్లను ప్రకటించినట్లు ఇండియన్ రైల్వైస్ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..