18 April, 2026
Subhash
మీరు మీ అన్ని పొదుపు ఖాతాలలో కలిపి రూ.10 లక్షలకు మించి నగదు జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖ ఆదాయ వివరాలపై ప్రశ్నించే అవకాశం ఉంది.
మీరు ప్రకటించిన ఆదాయంపై అనుమానాలు రేకెత్తించే విధంగా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీ చేస్తే ఆ విషయంపై ఐటీ శాఖ దృష్టికా రావచ్చు.
రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేసినా లేదా విక్రయించినా సంబంధిత అధికారి ఈ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుళ్తారు.
చాలా కాలంగ డియాక్టివేట్, వాడుకలో లేని ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్‌గా మారి పెద్ద లావాదేవీలు చేసినట్లయితే ఐటీ శాఖ కన్నేస్తుంది.
ఒక సంవత్సరంలో ఫారెక్స్ కార్డు, అంతర్జాతీయ క్రెడిట్ కార్డు లావాదేవీలకు మించి విదేశీ కరెన్సీని ఉపయోగిస్తే ఐటీ అధికారులు దృష్టి పెడతారు.
బ్యాంకులు, పోస్టాఫీసులు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి ఆదాయన్ని ఐటీఆర్‌లో తప్పుగా చూపించినట్లయితే ఐటీ శాఖ అధికారులు దృష్టి పెడతారు.
మీ క్రెడట్ కార్డు చెల్లింపులు నగదు రూపంలో రూ.1 లక్ష దాటినా లేదా మీ మొత్తం చెల్లింపులు రూ.10 లక్షలు దాటినా ఐటీ శాఖ గమనిస్తుంది.
మీ పొదుపు ఖాతా నుంచి పెద్ద లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అన్ని వివరాలు తనిఖీ చేయడం చాలా ముఖ్యం.